Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. టెన్షన్ తీరినట్లే కానీ..

ఇక సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలి అంటే జెట్ స్పీడ్ లో షూటింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 6:14 AM GMT
గుంటూరు కారం.. టెన్షన్ తీరినట్లే కానీ..
X

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఎంత హడావిడిగా మొదలైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ సినిమా షూటింగ్ మాత్రం అనుకున్న ప్లాన్ ప్రకారం ఇన్ని రోజులు కొనసాగ లేదు. ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్య ఎదురవుతూ చాలా రకాల బ్రేకులు అయితే పడ్డాయి. ఇక ఈ కాంబినేషన్లో అసలు సినిమా వస్తుందా లేదా అనే తరహాలో కథనాలు అయితే వెలుపడ్డాయి.

ముఖ్యంగా సినిమా సంక్రాంతికి రాకపోవచ్చు అని క్యాన్సిల్ అయినట్లు అనే విధంగా కూడా చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ఇక వాటన్నిటికి కూడా మహేష్ బాబు ఇటీవల చెక్ అయితే పెట్టాడు. ఇటీవల ఒక బిగ్ సి సంస్థకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ బాబు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చాలా కాలం తర్వాత మహేష్ బాబు మీడియా ముందుకు రావడంతో గుంటూరు కారం కు సంబంధించిన ఎలాంటి విషయాలు చెబుతారో అని ఫ్యాన్స్ అందరు కూడా ఎదురు చూశారు.

ఇక మహేష్ చెప్పిన మాట ప్రకారం అయితే గుంటూరు కారం సంక్రాంతికి వస్తుంది అని క్లారిటీ అయితే వచ్చేసింది. నిర్మాత వైపు నుంచి కూడా అదే క్లారిటీ వచ్చింది. ఇంకా కేవలం నాలుగు నెలల సమయమే ఉంది కాబట్టి గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇన్ని రోజులు మహేష్ బాబు ఏదో ఒక విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఆయన చాలా క్లియర్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది.

థమన్ ఇప్పటికే రెండు ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. ఇక వాటిలో మొదటి పాటను ఈనెల చివరలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలి అంటే జెట్ స్పీడ్ లో షూటింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక త్రివిక్రమ్ టీంకు అయితే ఇప్పుడే అసలైన సవాళ్లు ఎదురు కాబోతున్నాయి.

నాలుగు నెలల సమయంలో మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ మధ్య రమ్యకృష్ణ డేట్స్ విషయంలో కొంత ఇబ్బందులు వచ్చినట్లుగా టాక్ వచ్చింది కానీ అది నిజం కాదని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ డేట్స్ విషయంలో ఇబ్బందులు వచ్చినా కూడా అవసరమైతే మిగత క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రోజుకు 12 నుంచి 14 గంటల వర్క్ అయితే కొనసాగేలా త్రివిక్రమ్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు సమాచారం. మరి ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.