Begin typing your search above and press return to search.

గుంటూరు కారం OTT తేదీ

ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని ఓపెనింగులు సాధించింది. ఎట్ట‌కేల‌కు ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 3:56 AM GMT
గుంటూరు కారం OTT తేదీ
X

సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ క‌ల‌యిక‌లో రూపొందించిన 'గుంటూరు కారం' ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ డ్రామా. 12 జనవరి 2024న సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్ మాస్ యాక్ష‌న్ హీరోగా న‌టించారు. అత‌డి స‌ర‌స‌న శ్రీలీల ప్రధాన కథానాయికగా నటించింది. మీనాక్షి చౌద‌రి ఒక క‌థానాయిక‌.

ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని ఓపెనింగులు సాధించింది. ఎట్ట‌కేల‌కు ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని తెలిసింది. స్ట్రీమింగ్ సర్వీస్ ఈ చిత్రాన్ని 9 ఫిబ్రవరి 2024న తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మ‌ల‌యాళ‌ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు, వెన్నెల కిషోర్ నటించిన 'గుంటూరు కారం' హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. థమన్ సంగీతం పాట‌ల‌కు మిశ్ర‌మ స్పంద‌న‌లు వచ్చాయి. పెద్ద తెర‌పై అంత‌గా మెప్పించ‌లేక‌పోయిన ఈ సినిమా ఓటీటీ స్క్రీన్ పై ఏమేర‌కు ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటుందో చూడాలి. త్రివిక్ర‌మ్ - మ‌హేష్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఏ సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద తెర‌పై మెప్పించ‌లేదు. అత‌డు, ఖ‌లేజా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ లు. ఇప్పుడు గుంటూరు కారంకి యావ‌రేజ్ మార్కులే ప‌డ్డాయి.