'గుంటూరు కారం' ఓటీటీ ఫిక్సైంది
ఫిబ్రవరి 9 నుంచి సినిమా నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది.
By: Tupaki Desk | 4 Feb 2024 7:37 AM GMTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా తర్వాత క్రమేణా వసూళ్ల పెరగడంతో అది పాజిటివ్ టాక్ గా మారింది. 'గుంటూరు కారం' చిత్రం ఎలా ఉంటుంది? అని ఎక్కడా రివీల్ చేయకుండా సర్ ప్రైజ్ చేయాలని త్రివిక్రమ్ అండ్ కో భావించడం ఎంత ఉత్పతనానికి దారి తీసిందో తెలిసిందే.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కూడా అంగీకరించాడు. ముందే సినిమా గురించి చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. మహేష్ ని అలాంటి మాస్ పాత్రలో జీర్ణించుకోవడం ఓ సెక్షన్ ఆడియన్స్ లో నెగిటివ్ గా కనిపించినా తర్వాత పరిస్థితులు సర్దుకున్నాయి. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడంతో అంతా సేఫ్ జోన్ లో పడ్డారు. దీంతో మహేష్ కూడా మీడియా ముందుకొచ్చి విజయం అందించినందుకు కృతజ్ఞ తలు తెలియజేసాడు.
సాధారణంగా తన సినిమాలు ప్లాప్ అయితే మహష్ ఎక్కడా కనిపించరు. తర్వాత సినిమా రిలీజ్ అయ్యే వరకూ మీడియా అనే ప్రశ్నే ఉండదు. ఆనీ గుంటూరు కారం విషయంలో మాత్రం రిలీజ్ తర్వాత కూడా మీడియా ముందుకు రావడంతో తానెంత సంతోషంగా ఉన్నాడో? అర్దమైంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్సైంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ దక్కించుకుంది.
ఫిబ్రవరి 9 నుంచి సినిమా నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. థియేటర్లో సినిమా చూడని వారంతా ఫిబ్రవరి 9 నుంచి ఎంచక్కా ఓటీటీ లో చూసుకోవచ్చు. అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఓటీటీలో ఎక్కువ మంది వీక్షిస్తే గనుక కారం ఘాటు వర్కౌట్ అయినట్లే.