గుంటూరు కారం సెన్సార్.. అక్కడొక చిన్న చేంజ్
రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది.
By: Tupaki Desk | 9 Jan 2024 5:29 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకున్నాయి.
కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
గుంటూరు కారం సినిమాకి సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికెట్ జారీ చేయగా తాజాగా సినిమాకి సెన్సార్ యూనిట్ ఎలాంటి కట్స్ చెప్పలేదట. దాదాపు 159 నిమిషాల రన్ టైం తో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పలేదని సమాచారం. కాకపోతే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్ ని మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం జీరో కట్స్ తో 'గుంటూరు కారం' థియేటర్స్ లో సందడి చేయబోతోంది.
కాగా 'గుంటూరు కారం' టోటల్ రన్ టైం 2 గంటల 39 నిమిషాలు. అందులో ఫస్టాఫ్ 85 నిమిషాల సెకండ్ హాఫ్ 74 నిమిషాల నిడివితో ఉంటుందని చెబుతున్నారు. అంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్టాఫ్ పెద్దదిగా ఉంటుందట. సాధారణంగా ఏ సినిమా అయినా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ నిడివి ఎక్కువ ఉంటుంది. కానీ గుంటూరు కారం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావు, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.