గుంటూరు కారం.. మళ్ళీ అతడు తరువాత అలాంటి టచ్
త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ బాబుని కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు.
By: Tupaki Desk | 3 Jan 2024 2:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ల్యాంగ్ గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తోనే మూవీ టీం సినిమాపై ఆడియన్స్ లో మరింత హైప్ పెంచేశారు. త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ బాబుని కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు.
అతడు, ఖలేజా వంటి సినిమాలకు కమర్షియల్ జానర్ ని టచ్ చేసిన త్రివిక్రమ్ ఈసారి 'గుంటూరు కారం' లో పొలిటికల్ జానెర్ ని టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతడులో కూడా త్రివిక్రమ్ అసలు కథ పొలిటికల్ పాయింట్ తోనే స్టార్ట్ అవుతుంది. కానీ పూర్తిగా అటు వైపు వెళ్ళలేదు. కానీ 'గుంటూరు కారం' సినిమా కోర్ పాయింట్ అంతా పాలిటిక్స్ చుట్టే తిరుగుతుందట. నిజానికి ఈ సినిమా కథ ఏంటనేది ఇప్పటివరకు మూవీ టీం రివీల్ చేయకుండా దాచి పెట్టింది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ని బట్టి ఇదొక మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ వీటితో పాటూ సినిమాలో పొలిటికల్ అంశాలు మేళవించారని తెలుస్తోంది. గుంటూరు మేయర్ రాజకీయాల చుట్టూ ఈ కథ నడుస్తుందట. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెని మేయర్ చేసే బాధ్యత మహేష్ పై పడుతుందట.
ఆ ప్రయాణంలో ఎదురయ్యే అవాంతరాలు, ఆటంకాల నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఈ చిత్రం కోసం 'అమరావతికి అటూ ఇటూ' అనే టైటిల్ అనుకొన్నారు. ఆ టైటిల్ మరీ క్లాస్ అయిపోయిందని భావించిన 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ - మహేష్‌ల మధ్య సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్న మహేష్ ఇండియా వచ్చిన వెంటనే గుంటూరు కారం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, ఈశ్వరీ రావ్, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.