Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ఒక్క గుంటూరు కారమే టాప్.. మిగతావన్నీ ...

ఇప్పుడు నెట్టింట ఈ సంక్రాంతి సినిమాల పాటల గురించి తెగ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. గుంటూరు కారం తప్ప మిగతా చిత్రాల్లో మాస్ మసాలా సాంగ్ తో క్యాచీ పాట ఒక్కటి కూడా లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 5:41 AM GMT
ఆ విషయంలో ఒక్క గుంటూరు కారమే టాప్.. మిగతావన్నీ ...
X

తెలుగు నాట... బంధువులంతా ఒక చోట కలిసి సంక్రాంతి పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇక ఈ ఆనందాన్ని మరింత డబుల్ చేసుకోవడానికి కొత్త సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ పండుగ సమయంలో సినిమా హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం ఉండదు. కుటుంబమంతా కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశామా లేదా అనేది ముఖ్యం. దీంతో ఆ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకు కాసుల వర్షం కురవడం పక్కా.

అందుకే స్టార్ హీరోలు, మేకర్స్ తమ సినిమాలను ఆ సమయంలో రిలీజ్ చేసేందుకు పోటీ పడుతుంటారు. ఈ నేపథ్యంలో 2024 పెద్దపండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ కనిపించింది. దాదాపు అరడజను సినిమాలు పండక్కి వచ్చేందుకు పోటీ పడ్డాయి. అయితే అన్ని సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టం కనుక నిర్మాతలందరూ కలిసి చర్చించుకుని ఒక రెండు సినిమాలను పోస్టుపోన్ చేసుకున్న విషయం తెలిసిందే.

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరోసారి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని భావించినా.. నిర్మాత దిల్ రాజు కొద్దిరోజులే ముందు వాయిదా వేసేశారు. ఆ తర్వాత రవితేజ ఈగల్ వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నా సామి రంగ సంక్రాంతి పోటీలో నిలిచాయి. అయితే ఇప్పుడు నెట్టింట క్రేజీ చర్చ నడుస్తోంది. అది కూడా సంక్రాంతి సినిమాల పాటల కోసం.

విజయ్ బిన్నీ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగా మూవీ జనవరి 14వ తేదీన విడుదల కానుంది. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ఈ సినిమా నుంచి పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే మెలోడీ సాంగ్ తో పాటు టైటిల్ ట్రాక్, విజిల్ సాంగ్ విడుదల చేశారు. అవి సినీ ప్రియులను అట్రాక్ట్ చేసినా.. ఇప్పటి వరకు మాస్ ఫ్యాన్స్ కు నచ్చే సాంగ్ మాత్రం రాలేదు.

ఇక విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రమైన సైంధవ్ నుంచి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. అందులో బుజ్జికొండవే సాంగ్ కాస్త ఎమోషనల్ గా ఫేమస్ అయినా.. మిగతా రెండు పాటలు షరా మామూలే. మరో సంక్రాంతి సినిమా హనుమాన్ మూవీ నుంచి నాలుగు పాటలు రిలీజయ్యాయి. అవి కొన్ని యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నా.. పెద్ద క్యాచ్ అవ్వలేదని చెప్పొచ్చు.

ఇక సంక్రాంతికి భారీ థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమా గుంటూరు కారం. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన జనవరి 12న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ అవ్వగా... యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ కు అయితే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే.

అయితే ఈ సినిమాలో ఫస్ట్ రిలీజ్ అయిన ధమ్ మసాలా సాంగ్ కూడా సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంది. రెండో సాంగ్ ఓ మై బేబీ సాంగ్ కు కాస్త వ్యతిరేకత వచ్చినప్పటికీ.. మెల్లగా లయ అందుకుంది. ఇప్పుడు నెట్టింట ఈ సంక్రాంతి సినిమాల పాటల గురించి తెగ మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. గుంటూరు కారం తప్ప మిగతా చిత్రాల్లో మాస్ మసాలా సాంగ్ తో క్యాచీ పాట ఒక్కటి కూడా లేదని అంటున్నారు. మరి ఆ మూవీలన్నీ థియేటర్లలోకి వచ్చాకే అసలు విషయం తెలుస్తుంది.