Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం'... ఆంధ్ర, తెలంగాణ పొలిటికల్ టచ్

'గుంటూరు కారం' చిత్రం లో పొలిటికల్ టచ్​ కూడా ఉండబోతుందని తెలిసింది.

By:  Tupaki Desk   |   19 July 2023 5:45 AM GMT
గుంటూరు కారం... ఆంధ్ర, తెలంగాణ పొలిటికల్ టచ్
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సినిమా 'గుంటూరు కారం'. ప్రస్తుతం ఈ సినిమా ఎన్నో కష్టాల ను ఎదుర్కొంటూ షూటింగ్ జరుపుకుంటోంది. పక్కా మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందుతోంది. ఇందులో మహేశ్​ పాత్ర కూడా మాస్ ​గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజైన పోస్టర్ ను చూస్తే అర్థమవుతోంది. అయితే ఇప్పుడీ చిత్రం లో పొలిటికల్ టచ్​ కూడా ఉండబోతుందని తెలిసింది.

తాజాగా ఓ కొత్త పోస్టర్​ నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఇందులో ఓ ఫ్లెక్సీ కనపడుతోంది. సీనియర్​ నటుడు ప్రకాశ్​ రాజ్​ రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారు. 'ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైర వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనదళం పార్టీ యువజన నాయకులు నిజమాబాద్ జిల్లా' అని అందులో రాసి ఉంది. అంటే ప్రకాశ్​ రాజ్​.. శ్రీ వైర వెంకట స్వామి అనే పొలిటికల్​ లీడర్​గా కనిపిస్తారని అర్థమవుతోంది.

అయితే ఈ సినిమా టైటిల్​ 'గంటూరు కారం' కావడం వల్ల.. కేవలం ఆ నగరం చుట్టూ పక్కల జరిగే కథగా ఇది రూపొందుతుందని అంతా అనుకున్నారు. కానీ తాజా పోస్టర్​ లో నిజమాబాద్​ జిల్లా అని రాయడం కూడా.. మరో విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ చిత్రం లో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ పాలిటిక్స్​ బ్యాక్​డ్రాప్ కాస్త​ ఉండబోతుందని తెలుస్తుంది.

​ఇకపోతే గతం లోనే ఈ చిత్రం పొలిటికల్​ నేపథ్యంలో ఉండొచ్చని ప్రచారం సాగింది. అప్పట్లో ఈ సినిమా టైటిల్​ గురించి పెద్ద చర్చే సాగింది. 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్​ బాగా వైరల్ అయింది. అసలే ఏపీ రాజకీయాల్లో రాజధాని విషయమై అమరావతి పేరు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అందకే ఈ టైటిల్​ వల్ల ఎటువంటి కాంట్రవర్సీ రాకూడదని.. దాన్ని పక్కనపెట్టి 'గుంటూరు కారం' వైపు మొగ్గు చూపారు మేకర్స్​.

కాగా, ఈ గుంటూరు కారం.. మహేశ్‌ బాబు -త్రివిక్రమ్‌ కాంబోలో హ్యాట్రిక్‌ మూవీ గా రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన వీడియోలు, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ సినిమా లో కథానాయికలుగా మొదట పూజా హెగ్డే, శ్రీలీల ను తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి పూజా హెగ్డే తప్పుకోగా.. శ్రీలీల మెయిన్ హీరోయిన్‌ అయింది. రెండో హీరోయిన్‌ గా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు.. ఆమెనే స్వయంగా ఇటీవలే తెలిపింది.