గుంటూరు కారం కోయిన్సిడెన్స్ పాజిటివ్ వైబ్స్
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో చిత్రం `గుంటూరు కారం` సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.
By: Tupaki Desk | 30 Dec 2023 6:49 AM GMTమహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో చిత్రం `గుంటూరు కారం` సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. గురూజీ ఈ చిత్రాన్ని తనదైన శైలి కంటెంట్ తో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్న సమాచారం ఉంది. మునుపటి కంటే మహేష్ ఈ చిత్రంలో ఎంతో యంగ్ లుక్ తో కనిపిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడు ఈ చిత్రానికి అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` పోలిక ఆసక్తికర చర్చకు తావిస్తోంది.
యాధృచ్ఛికమే అయినా ఈ రెండిటి మధ్యా ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఆసక్తిని కలిగిస్తోంది. అలవైకుంఠపురములో (AVPL) షూటింగ్ 28 డిసెంబర్ 2020 నాటికి పూర్తయింది. అటుపై అన్ని పనులు ముగించుకుని 12 జనవరి 2021న థియేటర్లలో విడుదలైంది. ఆ సంవత్సరం అత్యుత్తమ బ్లాక్ బస్టర్ చిత్రంగా రికార్డుల్లో నిలిచింది. మహేష్ `సరిలేరు నీకెవ్వరు`తో పోటీలో AVPL సంక్రాంతి విజేతగా నిలిచింది. ముఖ్యంగా బన్ని చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ల జాబితాలో చేరింది.
ఆసక్తికరంగా 'గుంటూరు కారం` కూడా డిసెంబర్ 28న షూటింగ్ ముగించుకుని జనవరి 12న విడుదలవుతోంది. కేవలం రెండు సంవత్సరాల ముందు జరిగినదే ఇప్పుడు రిపీటైంది. త్రివిక్రమ్ నిర్ధేశనంలోని ఈ రెండు సినిమాలూ ఒకే రోజు షూటింగ్ పూర్తి చేసుకుని ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. కానీ హీరోలు మారారు. ఈ కాలక్రమం రెండు సంవత్సరాలు మారింది కానీ తేదీలు ఒకేలా ఉండడంతో అది అభిమానులను ఎగ్జయిట్ చేస్తోంది. దీంతో `గుంటూరు కారం'లో అల వైకుంఠపురములో వైబ్స్ స్పష్ఠంగా కనిపిస్తున్నాయని, అదే తీరుగా ఈ సినిమా కూడా సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. యాధృచ్ఛికమే అయినా కానీ గురూజీ.. తన ఫ్యాన్స్ ఆశించినది నిజం చేస్తారనే ఆశిద్దాం. కుటుంబ సమేతంగా వీక్షించే మంచి కంటెంట్.. అద్భుతమైన మ్యూజిక్ సెన్స్ తో త్రివిక్రమ్ ప్రతిసారీ మ్యాజిక్ చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో మరోసారి అది నిరూపణ అవుతుందనే అంతా భావిస్తున్నారు.