Begin typing your search above and press return to search.

గుంటూరు కారం కుర్చీ సాంగ్.. ఆ తాత ఏమన్నారంటే..

కుర్చీమడతపెట్టి డైలాగ్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన పెద్దాయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:17 AM GMT
గుంటూరు కారం కుర్చీ సాంగ్.. ఆ తాత ఏమన్నారంటే..
X

కుర్చీమడతపెట్టి డైలాగ్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన పెద్దాయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ ని అతను ఈ సందర్భంలో వాడాడో తెలియదు కాని సోషల్ మీడియాలో మీమ్స్ పేజీల వారికి భాగా ఉపయోగపడింది. దీనిపై రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. అలాగే సినిమాలలో కూడా డైలాగ్స్ రూపంలో వాడేసారు. అలాగే దీనిని ఒక ఊతపదంగా కూడా వాడేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ గుంటూరు కారంలో కుర్చీమడతపెట్టి డైలాగ్ ని చరణంగా వాడేసి మంచి మాస్ డ్యూయెట్ ని తమన్ అందించాడు. ఈ సాంగ్ ప్రోమోని శుక్రవారం రిలీజ్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. సాంగ్ ప్రోమోని కుర్చీ మడతపెట్టి అనే పదాన్ని హైలైట్ చేసి డాన్స్ మూమెంట్స్ చేయడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది.

దీనిని సోషల్ మీడియాలో యుట్యూబ్ చానల్స్ విపరీతంగా హైప్ చేస్తూ ఆ డైలాగ్ చెప్పిన పెద్దాయన దగ్గర ఇంటర్వ్యూలు, బైట్స్ తీసుకుంటున్నారు. ఒక స్టార్ హీరో తన డైలాగ్ ని పాట కోసం వాడుకోవడం అంటే ఎంతో గొప్ప విషయం అని ఆ పెద్దాయన చెప్పడం విశేషం. డైలాగ్ ఇంత పాపులర్ అవుతుందని అనుకోలేధంటూ తెలిపారు. జనవరి 12న రిలీజ్ కాబోయే గుంటూరుకారం సినిమా చూడటానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు.

ఈ సాంగ్ కి థియేటర్స్ లో డాన్స్ చేస్తానని, ఇంకా నాలో ఫుల్ ఎనర్జీ ఉందని తెలిపాడు. ఈ సాంగ్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మొత్తానికి ఓ పెద్దాయన వాడిన డైలాగ్ ని సాంగ్ కోసం థమన్ ఉపయోగించడం ఒక విశేషం ఈ డైలాగ్ ని థమన్ ఒక మీం పేజీ నుంచి డైరెక్ట్ గా కొనుక్కున్నారని తెలుస్తోంది. మరి ఈ కుర్చీ సాంగ్ ఎంత వరకు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు గుంటూరుకారం నుంచి వచ్చిన సాంగ్స్ అయితే పెద్దగా మెప్పించలేదని తెలుస్తోంది.