గుంటూరుకారం.. వాళ్ళు రిజెక్ట్ చేశారా?
దీంతో తమన్ ఇచ్చిన మ్యూజిక్ మహేశ్ కు నచ్చలేదని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తమన్ కంపోజ్ చేసిన ఓ మాస్ సాంగ్ కూడా మహేశ్ కు నచ్చలేదని పుకార్లు వచ్చాయి.
By: Tupaki Desk | 22 Dec 2023 7:58 AM GMTషూటింగ్ కు ఎన్నో అడ్డంకులు, రిలీజ్ కు వాయిదాలు, కొత్త కొత్త రూమర్లు, మూవీ కాస్ట్లో భారీ మార్పులు.. ఇవన్నీ జరిగిన సినిమా ఏదైనా ఉందంటే.. అది గుంటూరు కారం మూవీనే. మాటల మాంత్రికుడు తివిక్రమ్- సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా బరిలోకి దిగనుంది. అయితే ఈ సినిమాలోని పాటల రిలీజ్ ఇప్పటి వరకు ఎన్నో సార్లు వాయిదా పడింది.
దీంతో తమన్ ఇచ్చిన మ్యూజిక్ మహేశ్ కు నచ్చలేదని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తమన్ కంపోజ్ చేసిన ఓ మాస్ సాంగ్ కూడా మహేశ్ కు నచ్చలేదని పుకార్లు వచ్చాయి. వీటన్నింటినీ కొద్దిరోజుల క్రితం నిర్మాత నాగవంశీ కొట్టిపారేశారు. అయితే ఈ మధ్యలో వేరే మ్యూజిక్ డైరెక్టర్ల్ ద్వారా సినిమాలోని కొన్ని పాటలను కంపోజ్ చేయించుకోవాలని ప్లాన్ చేశారట మేకర్స్.
మాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను గుంటూరు కారం మేకర్స్ సంప్రదించారట. తెలుగులో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన ఆయనకు రెండు సాంగ్స్ కంపోజ్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఆయన ఇచ్చిన మ్యూజిక్ శాంపిల్స్ మేకర్స్ కు నచ్చలేదట. దీంతో ఆయనను తప్పించారట.
ఆ తర్వాత మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీకి టాప్ మ్యూజిక్ అందించిన స్టార్ సంగీత దర్శకుడిని సంప్రదించారట. ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ మహేశ్ కు కొంచెం కూడా నచ్చలేదట. దీంతో చేసేదేం లేక సినిమాలోని అన్ని పాటల బాధ్యతలను తమన్ కే అప్పగించారట. ప్రస్తుతం చిత్రబృందం సినిమా పాటలో విషయంలో బాగా కష్టపడుతోదంట.
ఇటీవలే సినిమా నుంచి విడుదలైన ఓ బేబీ సాంగ్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. ఆ పాట బాలేదంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ నెట్టింట హడావుడి చేశారు. ఆ సాంగ్ బాలేదని, సినిమా నుంచి తీసేయాలని కామెంట్లు చేశారు. మ్యూజిక్ అందించిన తమన్తో పాటు లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి ఫుల్ ట్రోల్ చేశారు.
ఇక సినిమా విషయానికొస్తే.. మహేశ్ సరసన శ్రీలీలతోపాటు మీనాక్షి చౌదరీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, రఘబాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక్ అండ్ హాసిన్ క్రియేషన్స్పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ.ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన మూవీ రిలీజ్ కానుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్లిక్ అయితే మ్యూజిక్పై ఉన్న డౌట్లన్నీ క్లియర్ అవుతాయని సినీ వర్గాల టాక్.