గురూజీ హ్యారిస్ జైరాజ్ ని దించుతున్నాడా?
ఈసినిమాకు సంగీత దర్శకుడిగా హ్యారిస్ జైరాజ్ ను తీసుకోవాలనే ఆలోచనలో గురూజీ ఉన్నట్లు లీకందింది.
By: Tupaki Desk | 30 Dec 2024 11:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రానికి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గురూజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైంది. నటీనటు లు..టెక్నీషియన్లు ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై తన టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈసినిమాకు సంగీత దర్శకుడిగా హ్యారిస్ జైరాజ్ ను తీసుకోవాలనే ఆలోచనలో గురూజీ ఉన్నట్లు లీకందింది.
తాను రాసుకున్న కథకు హ్యారిస్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ బలంగా విశ్వశిస్తున్నారుట. దీంతో మ్యూజిక్ లో గురూజీ పెద్ద మార్పే తీసుకురాబోతున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఆయన ఎక్కువగా మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్, తమన్ లతో మాత్రమే ఎక్కువ సినిమాలు చేసారు. వాళ్లతో మ్యూజిక్ చేయించుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదని, పని భారం కూడా తగ్గుతుందని ఆయన భావిస్తారు. త్రివిక్రమ్ అభిరుచికి తగ్గట్టు ఆ ముగ్గురు మ్యాచ్ అవుతారు. ట్యూన్స్ విషయంలో గురూజీ విజన్ ని ఈజీగా పట్టగల మ్యూజిక్ డైరెఉక్టర్లు వాళ్లు.
కానీ బన్నీతో ఇప్పుడు తీస్తోన్న చిత్రం పాన్ ఇండియా కావడంతో? హ్యారిస్ అయితేనే సరైన ఎంపికగా ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తుంది. మ్యూజిక్ లో కొత్తదనం కూడా కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హ్యారీస్ జైరాజ్ కూడా ఏమంత బిజీగా లేడు. ఐదేళ్లగా ఆయనకు సరైన అవకాశాలు లేవు. అరుల్ శరవణ్ నటించిన 'ది లెజెండ్' సినిమాకి సంగీతం అందించాడు.
తెలుగులో నితిన్ హీరోగా నటించిన 'ఎక్స్ ట్రార్డనరీ మ్యాన్' కు పనిచేసాడు. 'బ్రదర్' అనే తమిళ సినిమాకు 2024లో సంగీతం అందించాడు. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాలేవి కమిట్ అవ్వలేదు. అయితే సంగీతంలో రెహమాన్ తర్వాత అత్యంత పాపులర్ అయింది హ్యారిస్ జైరాజ్. ఎన్నో సినిమాలకు మ్యూజిక్ లు హిట్ లు అందించాడు. ఆ నమ్మకంతోనే గురూజీ హ్యారిస్ తో బెస్ట్ ఔట్ పుట్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.