ఐకాన్ స్టార్ చిత్రంలో ప్రియమైన తమ్ముడా?
సినిమాలో ఆ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఆ పాత్ర ఓ కొత్త నటుడు పోషిస్తే బాగుంటుందని గురూజీ భావించి శిరీష్ ని పిలిచి మాట్లాడారుట.
By: Tupaki Desk | 17 Dec 2024 2:45 AM GMTఅల్లు శిరీష్ సక్సెస్ కోసం ఎంతలా తపిస్తున్నాడో తెలిసిందే. ఆ యంగ్ హీరోకి సరైన సక్సెస్ పడి చాలా కాలమ వుతుంది. ఈ ఏడాది బడ్డీ అనే సినిమా చేసాడు. కానీ అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ శిరీష్ నుంచి కొత్త ప్రాజెక్ట్ వివరాలేవి రాలేదు. ఈ నేపథ్యంలో శిరీష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. అన్నయ్య సినిమాలో తమ్ముడు నటిస్తున్నాడనే ఓ వార్త వినిపిస్తుంది. మరి ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలియాలంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆ సినిమా సెట్స్ కు వెళ్లనుంది. గురూజీ ఈసారి తన రోటీన్ పార్మెట్ కథల్ని పక్కనబెట్టి బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ని బేస్ చేసుకుని రాసుకున్న కథ ఇది. మైథలాజికల్ టచ్ ఉన్న కథగా వినిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరా లు బయటకు రాలేదు గానీ...ఇందులో శిరీష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గీతా ఆర్స్ట్ కాంపౌండ్ వర్గాల నుంచి లీకైంది.
సినిమాలో ఆ పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఆ పాత్ర ఓ కొత్త నటుడు పోషిస్తే బాగుంటుందని గురూజీ భావించి శిరీష్ ని పిలిచి మాట్లాడారుట. పాత్ర నచ్చడంతో శిరీష్ కూడా ఒకే చెప్పినట్లు వినిపిస్తుంది. ఐడియా బాగుంది. ఐకాన్ స్టార్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్. అలాంటి స్టార్ చిత్రంలో స్వయంగా శిరీష్ నటిస్తే? అతడికి కలిసొచ్చే అంశమే. పైగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి శిరీష్ కి రెండు రకాలుగానూ ప్లస్ అవుతుంది.
రీజనల్ మార్కెట్ కి బన్నీ బ్రాండ్ తో రీచ్ అవ్వొచ్చు. అదే సమయంలో పాన్ ఇండియా మార్కెట్ కి పరిచయస్తుడు అవుతాడు. శిరీష్ అంటే బన్నీకి ఎంతో ఇష్టం. తనలా పెద్ద స్టార్ ఇంకా కాలేకపోతున్నాడు? అనే చిన్న పెయిన్ బన్నీలో ఉంది. తమ్ముడు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నానంటూ చాలా సందర్భాల్లో కూడా ఓపెన్ అయ్యాడు. మరి ఈ ప్రచారమే నిజమైతే? అన్నదమ్ములిద్దర్నీ అభిమానులు ఒకే ప్రేమ్ లో చూడొచ్చు.