Begin typing your search above and press return to search.

గురూజీ.. ఈ కాంబో పడితేనా!

2024 పద్మపురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపిక చేసింది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 4:54 PM GMT
గురూజీ.. ఈ కాంబో పడితేనా!
X

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. 2024 పద్మపురస్కారాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌కు ఎంపిక చేసింది. దీంతో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు చిరుకి శుభాకాంక్షలు మెగాస్టార్ కి పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్వీట్స్ చేసి విషెష్ అందజేస్తుంటే.. మరికొంతమంది సినీ ప్రముఖులు నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేస్తున్నారు. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.


'గుంటూరు కారం' రిలీజ్ తర్వాత బయట ఎక్కడా కనిపించని త్రివిక్రమ్ ఇప్పుడు మెగాస్టార్ కి పద్మ విభూషన్ రావడంతో ఆయన్ని కలిసేందుకు రావడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ గురూజీ - మెగాస్టార్ కాంబోలో సినిమా పడితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అప్పట్లోనే చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా చేయాల్సింది.


కానీ ఎందుకనో వీరి కాంబినేషన్ వర్క్ అవుట్ అవ్వలేదు. గతంలో మెగాస్టార్ నటించిన 'జై చిరంజీవ' సినిమాకి త్రివిక్రమ్ రైటర్ గా పని చేశారు. ఆ తర్వాత చిరంజీవితో గురూజీ సినిమా చేయాలనుకున్నారు. కొన్నిసార్లు చర్చలు కూడా జరిగినా వీరి కాంబినేషన్లో సినిమా మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు మెగా ఫాన్స్ వీరి కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ మెగాస్టార్ నోట వస్తే అది వేరే లెవెల్ లో ఉంటుందని, ఈ కాంబినేషన్ పడితే బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలవడం గ్యారెంటీ అంటూ ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నైనా ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందేమో చూడాలి.