హీరోల టఫ్ టైం లో గురూజీ.. !
స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ స్టార్ హీరోలతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు.
By: Tupaki Desk | 10 Jan 2024 10:30 AM GMTదర్శకుడిగానే కాదు స్టార్ హీరోలకు స్నేహితుడిగా.. కుటుంబ సభ్యుడిగా త్రివిక్రం శ్రీనివాస్ వారి టఫ్ టైం లో సపోర్ట్ గా ఉన్నారు. దర్శకుడు, హీరో ఈ రిలేషన్ సినిమా చేసే వరకే ఉంటుంది. కానీ వారి మధ్య స్నేహం మాత్రం అది వారిద్దరు కొనసాగించేంత వరకు.. వారి మధ్య రిలేషన్ ఉన్నంత వరకు ఉంటుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ స్టార్ హీరోలతో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. పవన్ కి చాలా దగ్గర వ్యక్తిగా ఉంటూ వస్తున్న గురూజీ మహేష్, ఎన్.టి.ఆర్ లకు కూడా మంచి స్నేహితుడిగా ఉంటూ వస్తున్నారు.
ముఖ్యంగా హీరోల టఫ్ టైం లో గురూజీ వారికి అండగా ఉంటున్నారు. ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేసే టైం లో తండ్రి హరికృష్ణని కోల్పోయారు. ఆ టైంలో త్రివిక్రం ఎన్.టి.ఆర్ కు కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ అందించారు. ఆ విషయాన్ని అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఇక నుంచి ఆయన నాకు గురువు అని కూడా అన్నారు. లేటెస్ట్ గా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మహేష్ అదే విషయాన్ని ప్రస్థావించారు.
ఈ రెండేళ్లుగా తనకు త్రివిక్రం సపోర్ట్ గా ఉన్నారు. ఆయన నాకు స్నేహితుడి కన్నా ఎక్కువ.. ఒక ఫ్యామిలీ మెంబర్ అని.. ఆయనకు ఐలవ్యూ చెప్పడం కన్నా ఏమి చేయగలనని అన్నారు. మహేష్ కూడా రెండేళ్లలో అమ్మా నాన్న ఇద్దరిని కోల్పోయారు. ఆ టైం లో గురూజీ మహేష్ ని ఓదార్చి ఆయనకు ఎమోషనల్ సపోర్ట్ అందించారు. సినిమా చేస్తున్న టైం లో కేవలం సినిమా చేశామా పని పూర్తి చేసుకున్నామా అన్నట్టు కాకుండా త్రివిక్రం స్టార్ హీరోలతో మంచి సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
ముఖ్యంగా వారి జీవితాల్లో టెస్టింగ్ టైం లో వారి పక్కన ఉంటూ వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరు గురూజీ అంటుంటారు. పవన్, మహేష్, ఎన్.టి.ఆర్ ఇలా ప్రతి స్టార్ తో త్రివిక్రం ఎమోషనల్ బాండింగ్ అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు చేసిన త్రివిక్రం అల్లు అర్జున్ తో కూడా జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు చేశారు. మహేష్ తో కూడా గుంటూరు కారంతో హ్యాట్రిక్ సినిమా పూర్తి చేశారు. ఎన్.టి.ఆర్ తో మాత్రమే అరవింద సమేత సినిమా ఒక్కటే చేశారు త్రివిక్రం.