Begin typing your search above and press return to search.

గురూజీ.. నెక్స్ట్ ఏంటి?

ముఖ్యంగా సినిమా చూసిన చాలామంది త్రివిక్రమ్ ఇలాంటి సినిమా తీయడం ఏంటని తీవ్ర విమర్శలు చేశారు.

By:  Tupaki Desk   |   19 Jan 2024 3:00 AM GMT
గురూజీ.. నెక్స్ట్ ఏంటి?
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదలై నెగిటివ్ టాక్ ని మూటకట్టుకుంది. మహేష్, త్రివిక్రమ్ దాదాపు 11 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో రిలీజ్ కి ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత అభిమానులతో పాటు మిగతా ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది.

సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై మహేష్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సినిమా చూసిన చాలామంది త్రివిక్రమ్ ఇలాంటి సినిమా తీయడం ఏంటని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో 'గుంటూరు కారం' మూవీపై దారుణంగా ట్రోల్ జరిగింది. కేవలం మహేష్ బాబు వల్లే ఈ మూవీ ఆడుతుందని, దీనికన్నా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీ బెటర్ అంటూ అభిమానులే బాహాటంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్‌గా దిల్‌ రాజు తన ఇంట్లో గుంటూరు కారం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశాడు. ఈ ఈవెంట్‌ కి మహేశ్ నమ్రత తో పాటూ గుంటూరు కారం టీం, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కానీ త్రివిక్రమ్ మాత్రం రాలేదు. దీంతో గురూజీ ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. మాములుగా డైరెక్టర్‌ అంటేనే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌. అలాంటి సినిమా సక్సెస్‌ మీట్‌కు ఆయనే రాకపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇక రిలీజ్ తర్వాత నిర్వహించిన ఇంటర్వ్యూలలోనూ త్రివిక్రమ్ కనిపించకపోవడం సరికొత్త చర్చకు దారి తీసింది. చివరికి మహేష్ బాబు ఇచ్చిన పార్టీకి కూడా వెళ్లకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో త్రివిక్రమ్ కి సంబంధించి రకరకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతానికి గురూజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, ఇప్పట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం లేదంటూ నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేయబోయే ప్రాజెక్టు అసలు పట్టాలెక్కుతుందా? క్యాన్సిల్ అవుతుందా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ ప్రాజెక్టు పుష్ప 2 తరువాత ఉండవచ్చు అని ఇంతకుముందు ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే వచ్చింది. కానీ ఇపుడు గుంటూరు కారం వలన గురూజీని బన్నీ ఎప్పటిలానే నమ్ముతారా లేదంటే మరొక ప్రాజెక్టు పై ఫోకస్ చేస్తారా అనేది చూడాలి. అలాగే ఓ మీడియం రేంజ్ హీరోతో కూడా త్రివిక్రమ్ సినిమా చేసే ఆలోచనలో ఆ మధ్య టాక్ వినిపించింది. మరి అది ఎంతవరకు నిజమవుతుందో కాలమే సమాధానం ఇవ్వాలి.