కోర్టు మెట్లు ఎక్కిన జీవి ప్రకాష్ దంపతులు!
అలా జరిగితే మంచిదేనంటూ సోషల్ మీడియాలో నెటి జనులు కూడా పోస్టులు పెట్టారు.
By: Tupaki Desk | 24 March 2025 12:27 PMసంగీత దర్శకుడు జీవి ప్రకాష్- గాయని సైంధవి వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు 2024లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిప్రాయ బేధాలు కారణంగా విడిపోతున్నట్లు వెల్లడించారు. కానీ ఇప్పటి వరకూ విడాకులు తీసుకోలేదు. దీంతో మళ్లీ మనసులు మారి కలుస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్త మయ్యాయి. అలా జరిగితే మంచిదేనంటూ సోషల్ మీడియాలో నెటి జనులు కూడా పోస్టులు పెట్టారు.
తాజాగా భార్యాభర్తలిద్దరు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఇరువురు ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి విడాకుల కోసం అర్జీ పెట్టుకున్నారు. చెన్నై ఫస్ట్ అడిషనల్ ఫ్యామిలీ కోర్టు జడ్జి ముందు ఇరువురు హాజరయ్యారు. ఇష్ట పూర్వకంగానే విడిపోతున్నట్లు వెల్లడించారు. అనంతరం విడాకులు వాయిదా వేసారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే కారులో కలిసి వెళ్లారు.
సైంధవి-జీవి చిన్న నాటి స్నేహితులు. 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల పాప ఉంది. ఇక జీవి వృత్తిపరంగా మంచి ఫాంలో ఉన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన `అమరన్` తో మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా మ్యూజికల్ గా మంచి విజయం సాధించింది. ఆర్ ఆర్ కి మంచి పేరొచ్చింది.
ప్రస్తుతం కోలీవుడ్ లో 'ఇడ్లీ కడై', 'పరాశక్తి' చిత్రాలకు సంగీతం అంది స్తున్నాడు. తెలుగులో యూత్ స్టార్ నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ వారంలోనే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే జీవి నటుడిగా కూడా రాణిస్తున్నాడు. తెలుగులోనూ జీవికి చాలా మంది అభిమా నులున్నారు.