Begin typing your search above and press return to search.

హీరోయిన్‌తో రిలేషన్‌... కొత్త అనుమానాలకు తెర!

తాజాగా జరిగిన కింగ్‌స్టన్ తెలుగు ప్రమోషన్‌ కార్యక్రమంలో యంగ్‌ హీరో నితిన్‌ పాల్గొన్నారు. దాంతో కింగ్‌స్టన్ గురించి తెలుగులో ఒక మోస్తరు బజ్ క్రియేట్‌ అయింది.

By:  Tupaki Desk   |   4 March 2025 11:27 AM IST
హీరోయిన్‌తో రిలేషన్‌... కొత్త అనుమానాలకు తెర!
X

సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా 'కింగ్‌స్టన్‌' అనే సినిమా రూపొందింది. తమిళ్‌తో పాటు తెలుగులో మార్చి 7న కింగ్‌స్టన్‌ రిలీజ్‌కి సిద్ధం అయింది. తెలుగులో ఇప్పటి వరకు జీవీ ప్రకాష్‌కి హీరోగా కమర్షియల్‌ బ్రేక్ దక్కలేదు. సంగీత దర్శకుడిగా ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా ఆయన నటించిన ప్రతి తమిళ్‌ మూవీ తెలుగులో విడుదల అవుతుంది. కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ప్రస్తుతం కింగ్‌స్టన్‌ సినిమాను సైతం తెలుగులో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన కింగ్‌స్టన్ తెలుగు ప్రమోషన్‌ కార్యక్రమంలో యంగ్‌ హీరో నితిన్‌ పాల్గొన్నారు. దాంతో కింగ్‌స్టన్ గురించి తెలుగులో ఒక మోస్తరు బజ్ క్రియేట్‌ అయింది.


కింగ్‌స్టన్‌ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్‌కి జోడీగా దివ్య భారతి హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరు గతంలోనూ కలిసి నటించారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. దివ్య భారతితో ప్రేమ కారణంగానే తన భార్య సైంధవికి జీవీ ప్రకాష్ విడాకులు ఇచ్చారంటూ విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య హీరోయిన్ దివ్య భారతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జీవీ ప్రకాష్‌తో ప్రేమ వార్తలు పుకార్లే అంటూ కొట్టి పారేసింది. ఇద్దరం కలిసి నటిస్తే ప్రేమ ఉన్నట్లేనా అంటూ ప్రశ్నించింది. జీవీ ప్రకాష్, సైంధవి కలిసి ఉండాలని కోరుకునే వారిలో నేను కూడా ఉంటాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

తాజాగా జీవీ ప్రకాష్ కింగ్‌స్టన్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా వారు దివ్య భారతి గురించి అడిగిన సమయంలో సమాధానం దాటవేశారు. తమ మధ్య ప్రేమ లేదని క్లారిటీ ఇవ్వలేదు. అలా అని ఇద్దరం ప్రేమలో ఉన్నామని కూడా చెప్పలేదు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, ఇప్పట్లో ఆ విషయాన్ని చెప్పకూడదని భావిస్తున్నారు అంటూ కొత్త అనుమానాలకు తెర తీసినట్లు అయింది. జీవీ ప్రకాష్ బాహాటంగా తాము ప్రేమలో లేము అని ఉంటే కచ్చితంగ ఆ అనుమానం వచ్చి ఉండేవి కాదు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సమాధానం దాట వేయడంతో కొత్త అనుమానాలకు తెర తీసినట్లు అయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

జీవీ ప్రకాష్ గత కొంత కాలంగా హీరోగా, సంగీత దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఇటీవల రాబిన్‌వుడ్‌ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతాన్న అందించాడు. ఒకసారి హీరోగా, సంగీత దర్శకుడిగా ఇంత బిజీగా ఎలా సినిమాలను జీవీ ప్రకాష్ చేస్తున్నాడో అర్థం కావడం లేదని చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. ఇటీవల సినిమా ప్రమోషన్‌ ఈవెంట్‌లోనూ నితిన్‌ అదే అన్నాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ, సంగీత దర్శకుడిగా ఇలా వరుసగా సినిమాలు ఎలా చేస్తున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు జీవీ ప్రకాష్ నవ్వుతూ ఎక్కువ సమయం వర్క్ చేస్తాను అన్నాడు. మొత్తానికి మెల్ల మెల్లగా టాలీవుడ్‌కి మరింత దగ్గర అవుతున్న జీవి ప్రకాష్ హీరోగా హిట్‌ కొట్టేనా చూడాలి.