Begin typing your search above and press return to search.

అనిరుద్ కి పోటీగా మ‌రో సంచ‌లనం!

ఎవ‌రీ యువ సంచ‌ల‌నం అంటూ అంత‌టా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాడు. `దేవ‌ర‌`తోనూ మ్యూజికల్ గా మంచి స‌క్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   14 April 2025 7:25 AM
అనిరుద్ కి  పోటీగా మ‌రో సంచ‌లనం!
X

'కొల‌వ‌రెడీ' పాట‌తో అనిరుద్ సౌత్ లో ఓ సంచ‌ల‌నంగా మారాడు. అటుపై అనిరుద్ సంగీతం అందించిన సినిమాలు వ‌రుస‌గా విజ‌యం సాధించ‌డంతో పాటు రిలీజ్ కు ముందే ఆ సినిమాలు మ్యూజిక‌ల్ గా సంచల‌నం అవ్వ‌డంతో అత‌డి పేరు ఇండ‌స్ట్రీలో మారుమ్రోగిపోయింది. అటుపై `విక్ర‌మ్`, `జైల‌ర్` విజ‌యం త‌ర్వాత పాన్ ఇండియాలో పెను సంచ‌ల‌నం అయ్యాడు. ఆ సినిమాలు పాట‌లు...బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇండియా అంతా అతడి వైపు చూసింది.

ఎవ‌రీ యువ సంచ‌ల‌నం అంటూ అంత‌టా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాడు. `దేవ‌ర‌`తోనూ మ్యూజికల్ గా మంచి స‌క్సెస్ అందుకున్నాడు. దీంతో తెలుగు సినిమా అవ‌కాశాలు కూడా పెరిగాయి. అయితే అనిరుద్ కి పోటీగా ఇప్పుడో యువ సంచ‌ల‌నం రెడీ అయ్యాడు. అత‌డే జీ.వి ప్ర‌కాష్‌. `అమ‌ర‌న్`, `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాల‌తో జీవి పేరు సౌత్ లో మారుమ్రోగిపోతుంది. `అమ‌ర‌న్` బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతోనే జీవి పేరు బాగా వెలుగులోకి వ‌చ్చేసింది.

అందులో క్లాసిక్ సాంగ్స్ తో పాటు..అద్భుత‌మైన ఆర్ ఆర్ ని అందించి అటెన్ష‌న్ డ్రా చేసాడు. ఇక రీసెంట్ రిలీజ్ `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో ఆర్ ఆర్ లో అనిరుద్ కి స‌రైన రీప్లేస్ మెంట్ అవుతాడ‌నే అంశం చ‌ర్చ‌కొచ్చింది. గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీల‌కు ఆర్ ఆర్ కొట్టాలంటే అనిరుద్ పేరే ఇప్ప‌టి వ‌ర‌కూ వినిపించేది. కానీ `గుడ్ బ్యాడ్ అగ్లీ `త‌ర్వాత అనిరుద్ లేక‌పోయినా జీవి వాయించేస్తాడు? అన్న ధీమా మేక‌ర్స్ లో క‌నిపిస్తుంది.

ఈ సినిమాకి అంత‌టి చ‌క్క‌టీ బీజీఎమ్ అందించాడు జీవీ. దీంతో ఇక‌పై జీవి-అనిరుద్ మ‌ధ్య బిగ్ ఫోటో త‌ప్ప‌ద‌నే అంశం చ‌ర్చ‌కొస్తుంది. జీవి ఇమేజ్ ఇప్పుడు రెట్టింట‌పు అవుతుంది. తెలుగులోనూ అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ప్ర‌స్తుతం జీవి కోలీవుడ్ లో చాలా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. న‌టుడిగా కొన‌సా గుతూనే సంగీత ద‌ర్శ‌కుడిగా కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు.