లేడీ డైరెక్టర్ తో సెంచరీ!
మ్యూజిక్ లెజెండ్ ఏ. ఆర్ .రెహమాన్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన జీ.వి ప్రకాష్ కూడా వెరీ ట్యాలెంటెడ్ .
By: Tupaki Desk | 8 Nov 2024 4:48 AM GMTమ్యూజిక్ లెజెండ్ ఏ. ఆర్ .రెహమాన్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన జీ.వి ప్రకాష్ కూడా వెరీ ట్యాలెంటెడ్ . సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ సత్తా చాటాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూనే హీరోగానూ చాలా సినిమాలు చేసాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ఓ పెద్దింటి కుటుంబం నుంచి వచ్చినా? జీవీ పోషించే పాత్రలు చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. నటుడంటే ఎలాంటి పాత్ర అయినా పోషించగలగాలి.
అప్పుడే పరిపూర్ణ నటుడు అవుతాడు అన్నడానికి జీవిని కూడా ఓ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఎలాంటి డీగ్రేడ్ పాత్రలోనైనా జీవి జీవిస్తాడు. అలాంటి భిన్నమైన పాత్రలే జీవికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. మరి అలాంటి జీవి సంగీత దర్శకుడిగా 100వ సినిమాలకు చేరువలో ఉన్నాడు? అంటే నమ్ముతారా? అవును జీవి ఇప్పుడు సెంచరీకి అతి దగ్గరలో ఉన్నాడు. 2006లో సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు.
తొలిసారి `వెయిల్` అనే సినిమాకి సంగీతం అందించాడు. అక్కడ నుంచి జీవి సంగీత దర్శకుడిగా వెనక్కి తీరిగి చూడలేదు. రెహమాన్ సారథ్యంలో గాయకుడిగా, కంపోజర్ గా రాటు దేలడంతో అవకాశాల పరంగా ఎలాంటి కొదవలేదు. సంగీత దర్శకుడిగా పీక్స్ లో ఉండగానే నటుడిగానూ కెరీర్ మొదలు పెట్టాడు. చిన్న పాత్రలతో మొదలై స్టార్ హీరోల సినిమాల్లో సైతం నటించడం మొదలు పెట్టాడు.
అలా నటుడిగా కొనసాగుతూనే మెయిన్ ట్రాక్ లో మ్యూజిక్ ని పెట్టి ముందుకు సాగాడు. ఇటీవల రిలీజ్ అయిన తెలుగు సినిమా `లక్కీ భాస్కర్` కి జీవీనే బాణీలు సమకూర్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే `అమరన్` సినిమా కూడా ఇతడే సంగీతం అందించాడు. ఇది రెండు రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఈ నేపథ్యంలో 100వ సినిమా సీక్రెట్ విప్పాడు. సుధ కొంగర దర్శకత్వంలో 100 వ సినిమా ఉంటుందని తెలిపాడు. త్వరలోనే ఆ సినిమా వివరాలు అధికారికంగా బయటకు వస్తాయన్నాడు.