టాలీవుడ్ నిర్మాత కి యువ సంచలనం చేసిన ప్రామిస్!
ఇతర భాషల చిత్రాలకు తెలుగు ఇండస్ట్రీ ఎంతటి పెద్ద పీట వేస్తుందో తెలిసిందే. పరభాషల చిత్రాలిక్కడ విరివిగా అనువాద రూపంలో రిలీజ్ అవుతుంటాయి
By: Tupaki Desk | 9 April 2024 9:12 AM GMTఇతర భాషల చిత్రాలకు తెలుగు ఇండస్ట్రీ ఎంతటి పెద్ద పీట వేస్తుందో తెలిసిందే. పరభాషల చిత్రాలిక్కడ విరివిగా అనువాద రూపంలో రిలీజ్ అవుతుంటాయి. కంటెంట్ బాగుంటే వాటికి అదరణ అలాగే ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఆదరించే అభిమానులిక్కడున్నారు. ఈ నేపథ్యంలో పక్క పరిశ్రమల సినిమాలు ఎక్కువగా అనువాదమవుతుంటాయి. ముఖ్యంగా తమిళ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. అయితే చిన్న సినిమాలు మినహా అగ్ర హీరోల కొంత మంది హైదరాబాద్ కి వచ్చి తమ సొంత సినిమాల్ని సైతం సరిగ్గా ప్రమోట్ చేయరనే విమర్శ ఉంది.
సూర్య..కార్తీ లాంటి వారు తప్ప మిగతా వారు హైదరాబాద్ లో ప్రమోట్ చేయడానికి ఇష్టపడరు అనే ప్రధాన విమర్శ ఉంది. అయితే తెలుగు సినిమా పాన్ ఇండియాని షేక్ చేసినా తర్వాత ఎంతటి స్టార్ అయినా హైదరాబాద్ కి వచ్చి ఇప్పుడు ప్రమోట్ చేసుకుంటున్నారు? అన్నది వేరే సంగతి. తాజాగా `డియర్` టైటిల్ తో జీవి ప్రకాశ్ చేసిన ఓ సినిమా ఈనెలలోనే రిలీజ్ అవుతోంది. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ వేడుకకు అతిథుల్లో ఒకరుగా నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు. ఇదే అదునుగా జీవీపై నాగవంశీ నవ్వుతూనే చురకలంటించారు. జీవి తమ సంస్థలో రెండు సినిమాలు చేసాడని..కానీ ఏనాడు వాటి ప్రమోషన్ కు హాజరు కాలేదన్నారు. కానీ తాము మాత్రం అతడి సినిమా తెలుగు వెర్షన్ కి హాజరయ్యాం అంటూ నవ్వేసారు. దీనికి జీవి కూడా నవ్వుతూనే బధులిచ్చాడు. నాగశంశీ సితార సంస్థ లో లక్కీ భాస్కర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నానని... ఆ సినిమాకి సంబంధించి ప్రతీ ఈవెంట్ కి తప్పక హాజరవుతాననని అన్నాడు.
దీంతో వేదికపై ఇద్దరి మధ్య సరదా సంభాషణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా పాన్ ఇండియాలో సక్సెస్ అయిన వైనం చూసి అన్ని పరిశ్రమలు ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ అయినా హైదరాబాద్ కి వచ్చి తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. అవసరం మేర తెలుగు స్టార్ హీరోల సహకారం తీసుకుంటున్నారు. ఎప్పుడూ తెలుగు వైపు చూడని తలపతి విజయ్ కూడా తెలుగులో వారసుడు సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.