మన స్టార్స్ ఫేవరెట్ ఆయనే..!
మన స్టార్స్ కి పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి జోష్ అందిస్తుంటాడు హకీం.
By: Tupaki Desk | 26 Sep 2023 10:22 AM GMTస్టార్ హీరోలు ఎప్పుడు ఫ్యాన్స్ ని అలరించడానికి ప్రత్యేకమైన వర్క్ అవుట్స్ చేస్తుంటారు. అభిమానులను ఎప్పటికప్పుడు తమ కొత్త లుక్స్ తో సర్ ప్రైజ్ చేసే స్టార్స్ వారి మేకోవర్ ఫ్యాన్స్ ని మెప్పించేలా ఉండాలని భావిస్తారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్ ఏమో కానీ హెయిర్ స్టైల్ మాత్రం క్రేజీగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలో మన స్టార్స్ వారి హెయిర్ స్టైలిస్ట్ లతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరికి హెయి స్టైలిస్ట్ గా చేస్తున్నాడు ఆలిం హకీం.
మన స్టార్స్ కి పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి జోష్ అందిస్తుంటాడు హకీం. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ న్యూ లుక్ ఫోటోస్ ని తన ఇన్ స్టా పేజ్ లో షేర్ చేశాడు. హకీం షేర్ చేసిన ఫోటోస్ లో మహేష్ సరికొత్త హెయిల్ స్టైల్ తో కనిపిస్తున్నాడు. ఓ యాడ్ షూట్ కోసం ఇలా మహేష్ మేకోవర్ జరిగినట్టు తెలుస్తుంది. తను చేసిన హెయిర్ స్టైల్ వల్ల స్టార్స్ మరింత అందంగా కనిపిస్తుంటారు.
తన వర్క్ కంప్లీట్ అయ్యాక వారితో ఒక ఫోటో దిగడం హకీంకి అలవాటు. మహేష్ తో కూడా అలాంటి ఫోటో ఒకటి దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు మహేష్ తో దిగినట్టుగానే ఇదివరకు ఎన్.టి.ఆర్ తో కూడా హకీం ఫోటో దిగాడు. మహేష్, ఎన్.టి.ఆర్ హెయిర్ స్టైలిస్ట్ గా హకీం సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. స్టార్స్ పర్సనల్ ఫోటోస్ అంటే అభిమానులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తన దగ్గర హెయిర్ స్టైల్ చేయించుకుంటున్న వారి ఫోటోస్ ఇన్ స్టా లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటున్నాడు ఆలిం హకీం.
మహేష్ ఎన్.టి.ఆర్ లకే కాదు మరికొంతమంది టాలీవుడ్ స్టార్స్ కి హకీం హెయిర్ స్టైలిస్ట్ గా చేస్తున్నాడు. అయితే సినిమాలకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నది సెపరేట్ టీం ఉంటుంది కానీ ప్రత్యేకంగా యాడ్స్ కోసం హకీంని సంప్రదిస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనా స్టార్స్ కి హెయిర్ స్టైలిస్ట్ గా హకీం సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు.