Begin typing your search above and press return to search.

హంస‌ని మించిన మ‌రో అద్భుతం నీవు!

హంసా నందిని హీరోయిన్ గా సినిమాలు చేసింది ఒక‌టి రెండు..కావ‌డంతో ఆ ర‌కంగా అమ్మ‌డు పెద్ద‌గా ఫోక‌స్ కాలేదు.

By:  Tupaki Desk   |   1 Dec 2023 3:30 PM GMT
హంస‌ని మించిన మ‌రో అద్భుతం నీవు!
X

హంసా నందిని హీరోయిన్ గా సినిమాలు చేసింది ఒక‌టి రెండు..కావ‌డంతో ఆ ర‌కంగా అమ్మ‌డు పెద్ద‌గా ఫోక‌స్ కాలేదు. కేవ‌లం ఐటం పాట‌ల్లోనే న‌ర్తించ‌డంతో హా...భామ‌గానే ఫేమ‌స్ అయింది. అప్ప‌టి నుంచి హంసా నందిని అంటే? ఐటం న‌టిగానే ప‌రిగ‌ణించారు త‌ప్ప సొగ‌స‌రి ఏనాడు హీరోయిన్ గా చూడలేదు. అస‌వ‌రం మేర స్పెష‌ల్ అప్పిరియ‌న్స్ వ‌ర‌కూ ప‌రిమితం చేసారు. ఆ ర‌కంగా హంసానందిని ప్ర‌తిభ‌ని పూర్తి స్థాయిలో చాటుకోలేక పోయింది.


ట్యాలెంట్ ఉన్నా? అవ‌కాశం రాక‌పోవ‌డంతో అలా క‌మిట్ అవ్వాల్సి వ‌చ్చింది. `ఒక‌టవుదాం`..`అభినేత్రి` లాంటి సినిమాల్లో హంసానందిని హీరోయిన్ అన్న సంగ‌తి ఎంత మందికి తెలుసు? ఆ చిత్రాల్లో బాగానే ఆక‌ట్టుకుంది. కానీ స‌రైన ప్యాడింగ్ లేని సినిమాలు కావ‌డంతో కిల్ అయ్యాయి. అటుపై ఐటం గాళ్ అనే ట్యాగ్..ఇన్ స్టాలో అమ్మ‌డి ఫోటో షూట్లు వంటివి అభిమానుల ఆలోచ‌న‌ల్ని పూర్తిగా మార్చేసాయి.


ప్ర‌స్తుతం అవ‌కాశాల కోసం పోరాటం చేస్తుంది. ఈ క్ర‌మంలో ఇన్ స్టాలో కొత్త ఫోటోలు షేర్ చేస్తుంది. ఆమ‌ధ్య కొన్నాళ్ల పాటు అనారోగ్యం బారిన ప‌డ‌టంతో నెట్టింట క‌నిపించ‌లేదు. కోలుకున్న వెంట‌నే సేవా కార్య‌క్ర‌మం లో ఇన్ స్టాలో ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతుంది. అలాగే రేర్ గా యువ‌తిని ఆక‌ర్షించే ఫోటోల‌తోనూ ముందుకొస్తుంది. తాజాగా అమ్మ‌డు చీరందంలో త‌ళుకులీనింది.


సొగ‌స‌రి చీరందంలో చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. నిజ‌మైన హంస‌ని మించిన మ‌రో అద్భుతం అంటూ ఉంటే అది నువ్వే అన్న రేంజ్ లో ముస్తాబైంది. పవ్వుల డిజైన్ సాధ‌రాణ చీర‌లో హంస ఎంత అందంగా ఉందో? వ‌ర్ణించ‌డం అన్న‌ది సాధ్యం కానిది. అచ్చ‌మైన తెలుగు అమ్మాయిలా అందంగా ముస్తాబైంది. నుదిటిన ఎర్న‌ని బొట్టు.. పువ్వుల చీర‌.. దాన్ని మ్యాచ్ చేస్తూ ర‌విక‌..చెవి బుల‌కాలు ప్ర‌తీది హంస‌ని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. హ‌లో డిసెంబ‌ర్ అంటూ ఇలా చీరంతా వెల్క‌మ్ చెప్పింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింటి వైర‌ల్ గా మారింది.