అమ్మ పేరుతో హంసానందిని కేన్సర్ పౌండేషన్!
అందులో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమానికి సంబంధించి తమ యామినీ పౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు.
By: Tupaki Desk | 7 Nov 2023 10:31 AM GMTక్యాన్సర్ మహమ్మారిని జయించిన నటీమణుల్లో నటి హంసా నందిని ఒకరు. రొమ్ము క్యాన్సర్‌తో ఆమె పెద్ద యుద్దమే చేసి జయించారు. ఇది సాధరణంగా వచ్చిన క్యాన్సర్ కాదు. తన తల్లి నుంచి జన్యుపరంగా క్యాన్సర్ బారిన పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎంతో మానసిక క్షోభకి గురయ్యారు. అయినా మహమ్మారిని జయించి ఎంతో మందిలో స్పూర్తి నింపారు. అప్పటి నుంచి హంసానందిని క్యాన్సర్ బాధితల పట్ల ఏదో వీడియో రూపంలో నెటి జనుల ముందుకొస్తున్నారు.
తన బాధ్యతగా అవేర్ నేస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా నేడు నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా హంసానందిని మరో వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసారు. అందులో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమానికి సంబంధించి తమ యామినీ పౌండేషన్ ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా యామినీ పౌండేషన్ ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పౌండేషన్ కి సంబంధించిన మెయిల్ ద్వారా కూడా తమ సమస్యని వివరించవచ్చు అని పేర్కొన్నారు.
రెగ్యులర్ సెల్ఫ్ చెకప్స్.. మామోగ్రఫీ.. జెనెటిక్ పరీక్షలు చేయించుకొంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉంటే రక్షించుకోవచ్చని చెబుతున్నారు. బ్రెస్ట్ కేన్సర్, దానికి సంబంధించిన చికిత్సల గురించిన సమాచారం దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నది తన లక్ష్యమని హంసానందిని చెబుతున్నారు.
జీవితంలో ప్రతి క్షణాన్ని ఆఖరి క్షణంలా జీవించాలని… క్యాన్సర్‌పై విస్తృత అవగాహన కల్పించి, సాధ్యమైనంతమంది ప్రాణాలు కాపా డాలని. దాని కోసమే మా అమ్మ పేరు మీద ‘యామిని కేన్సర్ ఫౌండేషన్’ నెలకొల్పనున్నట్లు చెప్పొకొచ్చారు. `కష్టాలతో కూడిన ప్రయాణం అందమైన గమ్యానికి మార్గం. ఎప్పుడూ బతుకు మీద ఆశ వదులుకోవద్దు. కేన్సర్ నుంచి బయటపడడం ఒక్కటే కాదు.. మళ్లీ ఆరోగ్యకరమైన అద్భుతమైన జీవితం కూడా సాధ్యమే అని గతంలో ఓ వీడియో చేసారు.