కొలమానం లేని ప్రేమ పొందడమెలా హంసా?
18 సంవత్సరాల క్రితం నేను భయంకరమైన వ్యాధితో తన తల్లిని కోల్పోయానని, క్యాన్సర్ అనే చీకటి నీడలో జీవించానని భయపడ్డానని తెలిపారు
By: Tupaki Desk | 14 March 2024 2:00 PM GMTరొమ్ము క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత తాను పునర్జన్మ పొందానని తెలిపారు హంసా నందిని. వంశపారంపర్యంగా వచ్చే రొమ్ము క్యాన్సర్‌తో బాధపడిన ఒక సంవత్సరం తర్వాత నటి హంసా నందిని తిరిగి సినిమా సెట్స్ లోను చేరారు. మహమ్మారీ నుంచి బయటపడి చివరికి తాను పునర్జన్మ పొందినట్లు భావిస్తున్నానని వెల్లడించారు. కెమెరా ముందు చాలా సజీవంగా ఉన్నానని అనిపిస్తుందని హంస అన్నారు. క్యాన్సర్ నుంచి బయటపడేందుకు 16 సైకిల్స్ కీమోథెరపీ చేయించుకున్నానని తెలిపారు.
18 సంవత్సరాల క్రితం నేను భయంకరమైన వ్యాధితో తన తల్లిని కోల్పోయానని, క్యాన్సర్ అనే చీకటి నీడలో జీవించానని భయపడ్డానని తెలిపారు. చాలా స్కాన్‌లు పరీక్షల తర్వాత కణితిని తొలగించారని తెలిపింది. అదంతా గతం అనుకుంటే వర్తమానంలో హంసానందిని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు అనవసరమైన ఒత్తిళ్లను తీసుకోకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నానని హంసానందిని తెలిపారు. ఇటీవల ట్రావెల్ బ్లాగర్ గా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌గాను హంస పాపులరయ్యారు.
తాజాగా ఇన్ స్టాలో హంసానందిని లేటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసారు. ``కొలమానం లేకుండా ప్రేమించడమే ప్రేమకు కొలమానం`` అన్న వ్యాఖ్యను జోడించిన ఈ బ్యూటీ హార్ట్ ఈమోజీని షేర్ చేసారు. తాజా ఫోటోషూట్ లో హంస డిజైనర్ ఫ్రాక్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హంస మాట్లాడుతూ తాను నటి అవ్వాలని కలలు కనలేదని, మోడలింగ్ లో ప్రవేశించాక నటన కోసం పుట్టానేమో అనిపించిందని తెలిపారు. అలా తనవైపు వచ్చిన మోడలింగ్ అవకాశాల్ని అందిపుచ్చుకుంటూనే, నటి అయ్యానని వెల్లడించారు. దర్శకరచయిత సీనియర్ వంశీ నుంచి కాల్ రాగానే తాను సర్ ప్రైజ్ అయ్యానని హంస తెలిపారు. ముంబైలో ఉన్నప్పుడే హైదరాబాద్ నుంచి చాలా మోడలింగ్ అసైన్ మెంట్స్ వస్తుండడంతో ఇక్కడికి వచ్చానని కూడా వెల్లడించారు.