Begin typing your search above and press return to search.

హన్సిక అప్పుడే టీవీలో ఎందుకు...?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో కంటే కూడా ఎక్కువగా కోలీవుడ్‌ లో సినిమాలు చేసింది, చేస్తూనే ఉంది

By:  Tupaki Desk   |   3 Jun 2024 12:09 PM GMT
హన్సిక అప్పుడే టీవీలో ఎందుకు...?
X

అల్లు అర్జున్‌ హిట్‌ మూవీ దేశ ముదురు తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు తెలుగు లో చేసిన సినిమా లు చాలా వరకు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈమె మాత్రం ఎక్కువగా తమిళ సినిమాలపై ఆసక్తి చూపించింది.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో కంటే కూడా ఎక్కువగా కోలీవుడ్‌ లో సినిమాలు చేసింది, చేస్తూనే ఉంది. హీరోయిన్‌ గా హన్సిక చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాయి. ఇంతలోనే పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది.

తాజాగా హన్సిక బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగు డాన్స్ షో ఢీ లో జడ్జ్ గా కనిపించబోతుంది. ఢీ కొత్త సీజన్‌ ప్రారంభం అయ్యింది. ఈ కొత్త సీజన్ కు జడ్జ్ గా ఈ అమ్మడిని తీసుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్స్‌ ఢీ జడ్జ్ లు గా వ్యవహరించిన విషయం తెల్సిందే.

ఇప్పుడు హన్సిక ఢీ జడ్జ్‌ గా రావడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే హన్సిక మొన్నటి వరకు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాంటి హన్సిక ఎలా డాన్స్ షో కు జడ్జ్ గా వ్యవహరించేందుకు ఓకే చెప్పింది అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు.

తెలుగు డాన్స్ షో ల్లో ఢీ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి ఢీ షో కి హన్సిక వంటి హీరోయిన్‌ ను జడ్జ్‌ గా ఎంపిక చేయడం ఖచ్చితంగా మంచి నిర్ణయమే. అయితే ఆఫర్లు లేని సమయంలో ఇలాంటి షో లు చేస్తారు, మరి హన్సిక కి ప్రస్తుతం చేతిలో ప్రస్తుతం సినిమాలు ఏమీ లేవా అనే చర్చ జరుగుతోంది.