సాయంత్రం 6 తర్వాత అతడితోనే...
తెలుగు సినిమాలతో హీరోయిన్ గా పరిచయం అయ్యి, ప్రస్తుతం పూర్తిగా తమిళ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ముద్దుగుమ్మ హన్సిక
By: Tupaki Desk | 10 Nov 2023 2:00 AM GMTతెలుగు సినిమాలతో హీరోయిన్ గా పరిచయం అయ్యి, ప్రస్తుతం పూర్తిగా తమిళ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా అదే జోష్ తో సినిమాలు చేయడం చూసి చాలా మంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అర డజను సినిమాలు ఉన్నాయి.
సాధారణంగా సౌత్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత కాస్త స్లో అవుతారు.. అంతే కాకుండా అందాల ఆరబోత విషయంలో కూడా కాస్త తగ్గుతారు. కానీ హన్సిక మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా ఓ రేంజ్ లో దూసుకు పోతుంది. అందాల ఆరబోత విషయం లో మునుపటి తో పోల్చితే ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు. అదే జోరు, అదే జోష్ తో దూసుకు పోతోంది.
తాజాగా ఈమె నటించిన మై నేమ్ ఈజ్ శృతి ఈనెల 17వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన హన్సిక మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లి తర్వాత కూడా అదే జోరు కొనసాగించడం పట్ల పలువురు ఆమెను ప్రశ్నించారు.
అందుకు సమాధానంగా హన్సిక మాట్లాడుతూ.... తాను పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దగా మార్పులు ఏమీ రాలేదు. షూటింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే నేను నటిని. ఇంటికి వెళ్తే సాధారణంగానే ఉంటాను. నా భర్త తో సాయంత్రం ఆరు తర్వాత మొత్తం సమయం కేటాయిస్తాను. సాయంత్రం ఆరు నుంచి అతడితోనే ఉంటాను కనుక నా వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేదు అంది.
పెళ్లి అయిన హీరోయిన్స్ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోలేక పోవడంతో వెంటనే కనుమరుగు అవుతున్నారు. అయితే హన్సిక మాత్రం చాలా పద్దతగా సినిమాలకు మరియు వైవాహిక జీవితానికి సమానమైన సమయం కేటాయించడం వల్ల కెరీర్ లో సాఫీగా సాగిపోతున్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.