Begin typing your search above and press return to search.

హ‌న్సికలో బ్యూటీకి హ‌ద్దులే లేవే!

తాజాగా హ‌న్సిక సిరీస్ నుంచి ఓ కొత్త ఫోటో ఇన్ స్టాలోకి వ‌దిలింది. ఇదిగో ఇక్క‌డిలా అమ్మ‌డు వీపు అందాల్ని ఆవిష్క‌రించి సిగ్గు..బిడియం ఒల‌క‌బోస్తుంది.

By:  Tupaki Desk   |   14 Dec 2023 3:20 PM GMT
హ‌న్సికలో బ్యూటీకి  హ‌ద్దులే లేవే!
X

ఆపిల్ బ్యూటీ హ‌న్సిక బ్యూటీని వ‌ర్ణించ‌డం ఎలా సాధ్యం. కెరీర్ ప్రారంభ‌మై రెండు ద‌శాబ్ధాలు అవుతున్నా! ఇప్ప‌టికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తుంది. అమ్మ‌డి అందంలో ఇసుమొత్తు కూడా మార్పు రాలేదు అంటే అతిశ‌యోక్తి కాదేమో. అదే స్కిన్ టోన్..అదే వెయిట్...అవే కొల‌మ‌నాలు. రూప లావ‌ణ్యంలో చిన్న మార్పు కూడా చోటు చేసుకోలేదు. మ‌ధ్య‌లో కాస్త చ‌బ్బీలుక్ లో ట్రాన్స‌ఫ‌ర్ అయినా అటుపై మ‌ళ్లీ స‌న్న‌జాజి సోయ‌గంలా మారిపోయి మునిప‌టి క‌శ్మీర్ ఆపిల్ అందంలోకి వ‌చ్చేసింది.


టాలీవుడ్ లో సినిమాల‌కు దూర‌మైనా ఇప్ప‌టికీ అదే బ్యూటీతో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. రేర్ గా అనువాద చిత్రాల‌తో అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. కోలీవుడ్ లో మాత్రం అమ్మ‌డి కెరీర్ కి తిరుగు లేకుండా ముందుకు సాగిపోతుంది. ఓవైపు క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేస్తూనూ మ‌రోవైపు లేడీ ఓరియేటెడ్ నాయిక గానూ స‌త్తా చాటుతోంది. బాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేసినా అక్క‌డా పెద్ద‌గా క‌ల‌సి రాలేదు.

దీంతో రెండు పడ‌వ‌ల ప్ర‌యాణం చేసి రెండిటికీ చెడ్డ రేవ‌డి అవ్వ‌డం దేనిక‌ని కోలీవుడ్ లో కెరీర్ ని చూజ్ చేసుకుంది.చెన్నైలోనే కాపురం ఉంటూ అక్క‌డే సీరియ‌స్ గా సినిమాలు చేస్తోంది. తాజాగా హ‌న్సిక సిరీస్ నుంచి ఓ కొత్త ఫోటో ఇన్ స్టాలోకి వ‌దిలింది. ఇదిగో ఇక్క‌డిలా అమ్మ‌డు వీపు అందాల్ని ఆవిష్క‌రించి సిగ్గు..బిడియం ఒల‌క‌బోస్తుంది. అమ్మ‌డు డిజైన్డ్ డ్రెస్ లో ఇలా లిప్ట్ లో కెమెరాకి చిక్కింది.

డిజైన‌ర్ మ్యాచింగ్ యాక్స‌ర‌సీస్..నెయిల్ పాలీస్..చెవి దిద్దులు ప్ర‌తీది హ‌న్సిక‌ని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. యాపిల్ బ్యూటీని ఇలా చూసి అభిమానులు ప్రేమ‌ని కురిపిస్తున్నారు. అమ్మ‌డి అందాన్ని పొగిడే క‌వులైపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక అమ్మ‌డు చాలా గ్యాప్ త‌ర్వాత 'మై నేమ్ ఈజ్ శృతి' అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించబోతుంది. ఈ వారంలోనే సినిమా ఆ సినిమా రిలీజ్ అవుతుంది.