Begin typing your search above and press return to search.

హీరోయిన్ చీర వెనుక డైరెక్ట‌ర్ సీక్రెట్ షాకింగ్!

టాలీవుడ్ కి అంద‌మైన హీరోయిన్లు దిగుమ‌తి చేయ‌డంలో హ‌ను రాఘ‌వ‌పూడి స్పెష‌లిస్ట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   7 Jan 2025 6:30 AM GMT
హీరోయిన్ చీర వెనుక డైరెక్ట‌ర్ సీక్రెట్ షాకింగ్!
X

టాలీవుడ్ కి అంద‌మైన హీరోయిన్లు దిగుమ‌తి చేయ‌డంలో హ‌ను రాఘ‌వ‌పూడి స్పెష‌లిస్ట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న హీరోయిన్లు అంటే ఆన్ ది స్క్రీన్ పైనే కాదు ఆఫ్ ది స్క్రీన్ లోనూ అంతే అందంగా ఉండాలి. అందుకు హ‌ను అభిరుచికి అంత ఫాలోయింగ్. ఆయ‌న ప‌రిచ‌యం చేసిన హీరోయిన్లు అయిన‌ లావ‌ణ్య త్రిపాఠి, మెహ‌రీన్ పిర్జాదా, మృణాల్ ఠాకూర్ అసాధార‌ణ‌మైన అంద‌గ‌త్తెలు.

ఆయన సినిమాల విజ‌యంలో ఆ బ్యూటీల అందం సైతం అంతే కీల‌క పాత్ర పోషించింది. ఇలా హీరోయిన్ల విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకోవ‌డం అన్న‌ది హ‌నుకే చెల్లింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో `పౌజీ` అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఢిల్లీ బ్యూటీ ఇమాన్వీని ఎంపిక చేసిన సంగ‌తి విధిత‌మే. లాంచింగ్ రోజు ఈ బ్యూటీ హైలైట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

అంద‌మే అసూయ ప‌డేంత అందంగ ఉందంటూ సినిమా రిలీజ్ కి ముందే బ్యూటీ నెటి జ‌నుల ప్ర‌శంస‌లందుకుంది. లాంచింగ్ రోజు ప్ర‌త్యేకంగా అంద‌మైన చీర‌క‌ట్టులో హైలైట్ అయింది. సాధార‌ణంగా హీరోయిన్లు అంటే వాళ్ల క‌ల్చ‌ర్ ప్ర‌కారం క‌నిపిస్తుంటారు. కానీ ఇమాన్వీ మాత్రం తెలుగు సంప్ర‌దాయ ప‌ద్ద‌తితో ప‌ద్ద‌తైన చీర‌క‌ట్టులో మెర‌వ‌డం అంద‌ర్నీ ఆక‌ర్షించింది. గోల్డ్ క‌ల‌ర్ చీర‌లో మ్యాచింగ్ ర‌విక ధ‌రించి మెరిసింది.

మ‌రి ఈ చీర సెల‌క్ష‌న్ అన్న‌ది డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడిది అన్న‌ది ఎంత మందికి తెలుసు. అవును ఇంత కాలం ఈ వ్య‌వ‌హారం గుట్టుగానే ఉన్నా ఇప్పుడ‌ది ర‌ట్టు అయింది. ఈ చీర‌ను స్వ‌యంగా హ‌నురాఘ‌వ‌పూడి సెల‌క్ట్ చేసాడట‌. తానే షాపుకు వెళ్లి కొని తెచ్చాడట‌. అంతేనా ఆ చీర కొన‌డం కోసం కొన్ని గంట‌ల పాటు స‌మ‌యాన్ని షాప్ లో వెచ్చించారట‌. లాంచింగ్ రోజు హీరోయిన్ చీర కోస‌మే ఇంత స‌మ‌యం కేటాయించారంటే సినిమాలో ఇమాన్వీని ఇంకెంత అందంగా చూపిస్తాడో ఊహ‌కి కూడా అంద‌దేమో.