సంక్రాంతి ఫైట్.. హనుమాన్ లెక్కలు క్లిక్కయితే డేంజరే
కాబట్టి తప్పకుండా మా సినిమానే సక్సెస్ అవుతుంది అనేంతల మేకర్స్ నమ్ముతూ ఈ పోటీలో రిస్కు చేయడానికి సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 29 Nov 2023 11:40 AM GMT2024 సంక్రాంతికి రాబోతున్న సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందా అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనంత డిఫరెంట్ సినిమాలు ఈ పొంగల్ బరిలో నిలవబోతున్నాయి. వేటికవే విభిన్నమైన తరహాలో కంటెంట్ పై చాలా నమ్మకంతో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మా సినిమానే సక్సెస్ అవుతుంది అనేంతల మేకర్స్ నమ్ముతూ ఈ పోటీలో రిస్కు చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇక ఇందులో కాస్త క్యాలిక్యులేషన్స్ తో వస్తున్న సినిమాలలో ప్రశాంత్ వర్మ తేజ సజ్జా.. హనుమాన్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. గుంటూరు కారం మాస్ మసాలా యాక్షన్ డోస్ తో రాబోతోంది. దానికి తోడు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో ఆ సినిమాకు క్రేజ్ ఏర్పడుతోంది.
అలాగే నా సామి రంగా అనే సినిమాను కూడా నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ గా మాస్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక ఫ్యామిలీ స్టార్ వస్తుందో రాదో ఇంకా క్లారిటీ లేదు. కానీ పండక్కు ఇది వస్తే ఇది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను దాని వైపుకు తిప్పుకునే అవకాశం ఉంది.
ఇక ఈగల్ సినిమా యాక్షన్ డ్రామాగా రాబోతోంది. కంటెంట్ క్లిక్ అయ్యే దాన్నిబట్టి ఈగల్ డామినేషన్ ఉంటుంది. ఇక హనుమాన్ మాత్రం పక్కా క్యాలిక్యులేషన్స్ తో సంక్రాంతిని టార్గెట్ చేసి రూపొందించినట్లుగా అనిపిస్తుంది. ఇటీవల దర్శకుడు ఇచ్చిన క్లారిటీ బట్టి ఈ సినిమా చిన్న పిల్లల నుంచి ఎక్కువ ఏజ్ ఉన్న ఓల్డేజ్ వాళ్ళ వరకు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని చెప్పాడు.
హనుమాన్ క్యారెక్టర్ లో సూపర్ హీరో తరహాలో తేజ సజ్జ నటించాడు అంటూ సినిమాలో పిల్లలను ఆకట్టుకునే అంశాలకు మాత్రమే కాకుండా అలాగే డివోషనల్ గా దైవత్వాన్ని నమ్మే పెద్దవాళ్లకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది అని చెప్పాడు. అంతేకాకుండా ఈ మధ్యలో ఉండే వాళ్ళు కూడా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తారు అని చెబుతున్నాడు. కాబట్టి ఈ సినిమా అతని అంచనాల ప్రకారం సంక్రాంతికి క్లిక్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఇటు వైపు తిరిగే అవకాశం ఉంటుంది.
ఇక ఈ సినిమా రిజల్ట్ మిగతా సినిమాలపై గట్టిగానే ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే అది ఎవరిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది ఆ సినిమాల వీక్ నెస్ ను ను బట్టి ఉంటుంది. ఏదేమైనా సంక్రాంతికి హనుమాన్ కు క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం పక్క అంటున్నారు. ఒక్క సిగరెట్ మందు సీన్ కూడా ఉండదట. కాబట్టి ఫ్యామిలీ అంతా దైర్యంగా ఇబ్బంది లేకుండా చూసే సినిమా అవుతుందని అంటున్నారు. మరి ఇంత క్లీన్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా కొత్తగా ఉంటుందో లేదో చూడాలి.