Begin typing your search above and press return to search.

అసలైన ట్రెండ్ ని పట్టుకున్న హనుమాన్!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా హనుమాన్. ఈ సినిమాని జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 5:02 AM GMT
అసలైన ట్రెండ్ ని పట్టుకున్న హనుమాన్!
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా హనుమాన్. ఈ సినిమాని జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. క్యాస్టింగ్ చిన్నగా ఉన్న బడ్జెట్, కంటెంట్ పరంగా ఈ సినిమా చాలా రిచ్ గా ఉందని చెప్పాలి. అలాగే హిందువుల ఆరాధ్యదైవం అయిన హనుమంతుడితో రిలేట్ అయ్యి ఉన్న స్టోరీ కావడంతో కచ్చితంగా అందరికి కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

అందుకే మహేష్ బాబు గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగ, రవితేజ ఈగల్ సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్న కూడా ప్రశాంత్ వర్మ వెనక్కి తగ్గకుండా హనుమాన్ ని రిలీజ్ చేస్తున్నాడు. తేజ సజ్జా మార్కెట్ పరంగా చూసుకుంటే సినిమాకి పెట్టిన పెట్టుబడిని ఒక్క తెలుగులో రాబట్టడం చాలా కష్టం. అందుకే నార్త్ ఇండియాపైన ప్రశాంత్ వర్మ ఫోకస్ అంతా ఉంది.

జనవరి 23న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగబోతోంది. దీని కోసం ముందునుంచే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రామ మందిరం నిర్మాణం సమయానికి దేశం మొత్తం శ్రీరామ నామస్మరణ వినిపించేలా ఛానల్స్ ద్వారా కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. రామమందిరం ప్రారంభోత్సవం కోసం జరిగే బజ్ ని తన హనుమాన్ సినిమాకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రశాంత్ వర్మ సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.

నార్త్ ఇండియాలో హిందూ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య దైవంతో ముడిపడి ఉన్న కాంతార, కార్తికేయ 2 కథలు నార్త్ లో సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాగే రామమందిరం ప్రారంభోత్సవ వైబ్ హనుమాన్ సినిమాకి స్పెషల్ ప్రమోషన్ అవుతుందని అనుకుంటున్నాడు. సినిమా కంటెంట్ ఎలాగూ బాగుంటుంది కాబట్టి నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి మూవీ కనెక్ట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు.

అదే జరిగితే రాముడి వైబ్ ప్రశాంత్ వర్మ హనుమంతుడికి భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టడం గ్యారెంటీ అనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే తెలుగులో కంటే నార్త్ ఇండియాలో హనుమాన్ సినిమాని కొనడానికి బయ్యర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంట. పోటీ పడి మరి హనుమాన్ రిలీజ్ రైట్స్ ని నార్త్ ఇండియా రాష్ట్రాలలో తీసుకుంటున్నారని తెలుస్తోంది. మరి ప్రశాంత్ వర్మ ప్లానింగ్ హనుమాన్ సినిమాకి ఏ విధంగా ప్లస్ అయ్యి నిర్మాతకి కాసులు కురిపిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.