Begin typing your search above and press return to search.

హనుమాన్.. 4 రోజుల్లోనే సెంచరీ

యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

By:  Tupaki Desk   |   16 Jan 2024 8:36 PM GMT
హనుమాన్.. 4 రోజుల్లోనే సెంచరీ
X

టాలీవుడ్‌లో సినిమా.. సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. జాంబీ రెడ్డి మూవీ తర్వాత హనుమాన్ సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇటు తెలుగుతో పాటు హిందీలో అదరగొడుతోంది. అంతేకాదు అమెరికాలోనూ కేక పుట్టిస్తోంది.

వాస్తవానికి.. హనుమాన్ మిడ్ రేంజ్ సినిమా అయినా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురములో వంటి భారీ సినిమాల రికార్డ్స్‌ను బద్దలు కొడుతోంది. యూఎస్ మార్కెట్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ ముందు రోజు వేసిన ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ లో కూడా హనుమాన్ హవా చూపిస్తోంది. సినిమా రిలీజై నాలుగు రోజులు దాటుతున్నా థియేటర్స్ ఇంకా హౌస్ ఫుల్ అవుతున్నాయి.

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. వంద కోట్ల గ్రాస్‌ను అందుకున్నట్లు హనుమాన్ టీమ్ ఓ పోస్టర్‌ను విడుద చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తనకు ఇది ఫస్ట్ వంద కోట్ల సినిమా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్‌ ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ను అధిగమించింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లన్నీ లాభాల కిందే లెక్క. అయితే అంచనా ప్రకారం.. నాలుగు రోజుల్లో వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం- రూ.10.46 కోట్లు

సీడెడ్- రూ.3.29 కోట్లు

ఉత్తరాంధ్ర- రూ.3.26 కోట్లు

తూర్పు గోదావరి- రూ.2.19 కోట్లు

పశ్చిమ గోదావరి- రూ.1.33 కోట్లు

గుంటూరు- రూ.1.57 కోట్లు

కృష్ణ- రూ.1.19 కోట్లు

నెల్లూరు- రూ.74 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాలు- రూ.24.03 కోట్లు (రూ.38.55 కోట్ల షేర్)

కర్ణాటక- రూ.4.65 కోట్లు

హిందీ+ROI- రూ.8.40 కోట్లు

ఓవర్సీస్- రూ. 13.95 కోట్లు

వరల్డ్ వైడ్- రూ. 53.03కోట్లు (రూ.100 కోట్ల గ్రాస్)

ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ కథానాయికగా మెరిసింది. వరలక్ష్మీ శరత్ కుమార్‌, వినయ్‌ రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బరిలో స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నా, థియేటర్లు పరిమిత సంఖ్యలోనే దొరికినా పాజిటివ్‌ టాక్‌ రావడంతో వసూళ్లలో దూసుకుపోతోంది హనుమాన్‌. చాలా చోట్ల ఈ మూవీ టికెట్లు దొరకడం గగనంగా మారిపోయింది. సంక్రాంతితో పాటు వరుసగా సెలవులు రావడం హనుమాన్‌ జోరుకు కారణమని చెప్పుకోవచ్చు. ఏదైమైనా ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించారు ప్రశాంత్ వర్మ.