Begin typing your search above and press return to search.

హనుమాన్.. అక్కడ కలెక్షన్స్ తక్కువే..

నార్త్ ఇండియన్ ఆడియన్స్ తెలుగు సినిమా అనేసరికి ఏదో విషయం ఉండొచ్చు అనే పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:32 AM GMT
హనుమాన్.. అక్కడ కలెక్షన్స్ తక్కువే..
X

తెలుగు సినిమా మార్కెట్ పెరిగిందని అందరూ అంటున్నారు. అందుకే భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి వెనుకాడటం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో మన తెలుగు హీరోలు మూవీస్ చేస్తున్న కూడా గట్టిగా చూసుకుంటే తెలుగు కాకుండా కేవలం నార్త్ ఇండియాలో మాత్రం కాస్తా మార్కెట్ క్రియేట్ అయ్యింది.

నార్త్ ఇండియన్ ఆడియన్స్ తెలుగు సినిమా అనేసరికి ఏదో విషయం ఉండొచ్చు అనే పాజిటివ్ దృక్పథంతో ఉన్నారు. దీనికి కారణం కార్తికేయ2, పుష్ప లాంటి సినిమాలు. రాజమౌళి చేసే సినిమాలకి మాత్రమే అన్ని భాషల నుంచి ఆదరణ లభిస్తోంది. పక్క రాష్ట్రాలైన తమిళ్, మలయాళీ భాషలలో మన పాన్ ఇండియా సినిమాలకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు.

రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ సలార్ తెలుగు తర్వాత నార్త్ లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపించలేదు. కన్నడంలో అంటే ఉగ్రం రీమేక్ అనే క్లారిటీ ఉంది కాబట్టి సలార్ చూడలేదు. కానీ తమిళ్, మలయాళీ భాషలలో కూడా పెద్దగా ఆదరించలేదు. సైరా నరసింహా రెడ్డి సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార లాంటి తమిళ్ స్టార్స్ ఉన్న పెద్దగా ఆదరణకి నోచుకోలేదు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీకి కూడా ఆ రాష్ట్రాలలో ఆశించిన సక్సెస్ రాలేదు. తాజాగా వచ్చిన హనుమాన్ కి అయితే నార్త్ ఇండియాలో పట్టం కడుతున్నారు. కాని తమిళనాడు, కేరళలో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా రాలేదని తెలుస్తోంది. తమిళనాడులో 2.25 కోట్ల గ్రాస్ వస్తే అందులో మెజారిటీ తెలుగు వెర్షన్ ద్వారానే వచ్చింది. కేరళలో అయితే కేవలం 50 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. కర్ణాటకలో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదని టాక్.

అయితే తమిళ్ సినిమాలలో చాలా వాటిని తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులు ప్రాంతీయత ఫీలింగ్ లేకుండా ఆదరిస్తూ ఉంటారు. సూర్య, విజయ్, అజిత్, కార్తి, విక్రమ్, కమల్ హాసన్, రజినీకాంత్, శివ కార్తికేయన్, ధనుష్ లాంటి వారికి తమిళంలో ఎంత ఫేం ఉందో తెలుగులో కూడా అంతే స్థాయిలో ఉంది. వారి సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కాని మన స్టార్ హీరోల సినిమాలని కోలీవుడ్ లో తమిళ్ ఆడియన్స్ కనీసం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. కేవలం వారి సినిమాలని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే పక్కనే ఉన్న తెలుగైనా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.