Begin typing your search above and press return to search.

హనుమాన్ బిగ్గెస్ట్ రికార్డ్.. పెద్ద సినిమాల కంటే గ్రేట్

హనుమాన్.. రిలీజ్ కు కొన్ని వారాలకు ముందు ఓ చిన్న సినిమా మాత్రమే. కానీ విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ సినిమా రేంజ్ వేరని అర్థమైంది

By:  Tupaki Desk   |   22 Jan 2024 8:31 AM GMT
హనుమాన్ బిగ్గెస్ట్ రికార్డ్.. పెద్ద సినిమాల కంటే గ్రేట్
X

హనుమాన్.. రిలీజ్ కు కొన్ని వారాలకు ముందు ఓ చిన్న సినిమా మాత్రమే. కానీ విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ సినిమా రేంజ్ వేరని అర్థమైంది. ఇక థియేటర్లలోకి వచ్చాక ఈ మూవీ స్థాయి ఎవరూ ఊహించని రేంజ్ కు వెళ్లిపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ.. కనక వర్షం కురిపిస్తోంది. మేకర్స్ కు లాభాలను తెచ్చిపెడుతోంది.

సినిమా విడుదలై పది రోజులు అయినా.. అనేక చోట్ల మూవీ టికెట్లు దొరకడం కష్టంగా మారింది. హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి. థియేటర్లు, షోలు పెరుగుతున్నాయి. కనీసం ఇంకో రెండు వారాల పాటు హనుమాన్ జోరు.. ఇలానే కంటిన్యూ అయ్యేలా ఉంది. దీంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

ఇటీవలే ఓవర్సీస్ లో తెలుగులో ఉన్న టాప్ హీరోలకు కూడా అందని రికార్డును సాధించిందీ మూవీ. విదేశాల్లో ఏకంగా నాలుగు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో 4 మిలియన్ డాలర్ల కు పైగా వసూలు చేసిన సినిమాలు తెలుగులో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. తాజాగా మరో రికార్డు సృష్టించిందీ మూవీ.

ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాగా హనుమాన్ నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు.. ప్రశాంత్ వర్మతోపాటు మూవీ కాస్ట్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. హనుమాన్-2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. మరి రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన తెలుగు సినిమాల జాబితాలో హనుమాన్ కన్నా ముందు ఏఏ చిత్రాలు ఉన్నాయంటే

1)బాహుబలి

2)బాహుబలి2

3)రంగస్థలం

4)సాహో

5)సైరా నరసింహారెడ్డి

6)అలవైకుంఠపురములో

7)సరిలేరు నీకెవ్వరు

8)పుష్ప ది రైజ్

9) ఆర్ఆర్ఆర్

10) వాల్తేరు వీరయ్య

11) సలార్

12) హనుమాన్

రాబోయే రోజుల్లో హనుమాన్ సినిమా అనేక సంచలనాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలై గ్లోబల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ సినిమాపై ఇప్పటినుంచే భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దానికి బిజినెస్ భారీగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.