Begin typing your search above and press return to search.

హనుమాన్.. 200 కోట్లు దాటినా లాభం లేదా?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్యలో రామమందిరం, సినిమాల్లో హనుమాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది

By:  Tupaki Desk   |   23 Jan 2024 5:14 AM GMT
హనుమాన్.. 200 కోట్లు దాటినా లాభం లేదా?
X

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్యలో రామమందిరం, సినిమాల్లో హనుమాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇండియన్ సూపర్ హీరో మూవీగా ఈ చిత్రం సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి వచ్చి థియేటర్స్ దొరకని పరిస్థితి నుంచి ఏరికోరి థియేటర్స్ అడిగి మరీ ఇచ్చే స్థాయికి హనుమాన్ మూవీకి ప్రేక్షకాదరణ పెరిగింది. టాలీవుడ్ లో భారీ లాభాలు తెచ్చి పెట్టే మూవీగా హనుమాన్ మారబోతోంది.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ ని దాటేసింది. షేర్ లెక్కలు చూసుకున్న 100 కోట్లు అధికమించింది. చాలా తక్కువ సమయంలో వంద కోట్లు అందుకున్న చిన్న చిత్రంగా హనుమాన్ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పాలి. నార్త్ ఇండియన్ బెల్ట్ లో హనుమాన్ కి ఆడియన్స్ నీరాజనం పడుతున్నారు. లాభాలు లెక్కలు చూసుకుంటే ఇప్పటి వర్కౌ 70 కోట్ల పైనే నిర్మాతకి వచ్చి ఉంటాయని అందరూ అనుకుంటారు.

అయితే ఈ మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డికి హనుమాన్ ద్వారా వచ్చే లాభాలలో ఎలాంటి వాటా లేదంట. దీనికి కారణం మూవీ థీయాట్రికల్ రైట్స్ మొత్తం మైత్రీ మూవీ మేకర్స్ కి అమ్మేశారు. అలాగే డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకి అమ్ముడయ్యాయి. రిలీజ్ కి ముందే నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్ అయితే హనుమాన్ తో వచ్చింది. కానీ ఇప్పుడు కలెక్షన్స్ ద్వారా వచ్చే లాభాలలో ఎక్కువ భాగం డిస్టిబ్యూషన్ చేసిన మైత్రీ వారికి సొంతం అవుతాయి.

అలాగే హిందీలో కూడా థీయాట్రికల్ రైట్స్ ని ముందుగానే వేరొకరికి అమ్మేశారు. అయితే అక్కడ మూవీ భారీ లాభాలు కొల్లగొడుతుంది. ఓవర్సీస్ లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి. 4 మిలియన్ డాలర్స్ కి పైగా ఇప్పటి వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. నిజానికి 1 మిలియన్ డాలర్స్ బ్రేక్ ఈవెన్ తోనే ఓవర్సీస్ లో హనుమాన్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు భారీ లాభాలు అక్కడ డిస్టిబ్యూటర్స్ కి వస్తున్నాయి.

అందుకే మూవీ ద్వారా ప్రస్తుతం వస్తోన్న లాభాల్లో నిర్మాత నిరంజన్ రెడ్డికి పెద్దగా ఏమి దక్కవు. మూవీ ఇంకా 50 నుంచి 100 కోట్ల గ్రాస్ వరకు లాంగ్ రన్ లో కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈ ఏడాది టాలీవుడ్ లో హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా హనుమాన్ నిలుస్తోంది.