Begin typing your search above and press return to search.

హనుమాన్.. పోటీలో ఎంత బలంగా ఉన్నాడంటే..

అయితే ఈ సినిమా వాయిదా పడవచ్చు అని గాసిప్స్ పుట్టుకొస్తున్న తరుణంలో మళ్ళీ చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది.

By:  Tupaki Desk   |   2 Nov 2023 4:00 PM GMT
హనుమాన్.. పోటీలో ఎంత బలంగా ఉన్నాడంటే..
X

2024 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద నెవెర్ బిఫోర్ అనేలా వాతావరణం కనిపించబోతున్నట్లుగా అర్థమవుతుంది. పెద్ద సినిమాలు వస్తే మీడియం రేంజ్, చిన్న బడ్జెట్ సినిమాలు కాస్త వెనుకడుగు వేసే ప్రయత్నం అయితే చేస్తాయి. కానీ ఈసారి ఏ సినిమా కూడా సంక్రాంతి పోటీ నుంచి వెనక్కి తగ్గాలని అనుకోవడం లేదు. వీలైనంతవరకు గాసిప్స్ వచ్చిన ప్రతిసారి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో మేజర్ గా వాయిదా పడతాయి అనుకున్న సినిమాలే సంక్రాంతికి రాబోతున్నట్లుగా పదేపదే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ లిస్టులో మొదటగా హనుమాన్ సినిమా నిలుస్తోంది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై బజ్ అయితే బాగానే ఉంది. అయితే ఈ సూపర్ హీరో సినిమాకు సంక్రాంతి టైంలో థియేటర్లు దొరుకుతాయా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ సినిమా వాయిదా పడవచ్చు అని గాసిప్స్ పుట్టుకొస్తున్న తరుణంలో మళ్ళీ చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో అన్ని పనులు పూర్తి చేసుకున్న ఏకైక సినిమా తమదే అన్నట్లుగా వివరణ ఇచ్చారు. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది అని ఇక కేవలం సినిమాను విడుదల చేయడమే తరువాయి భాగం అన్నట్లుగా కూడా బలంగా చెబుతున్నారు.

సంక్రాంతికి రవితేజ ఈగల్ వాయిదా పడవచ్చు అని కూడా గాసిప్స్ రాగా అందులో నిజం లేదు అని ఆ చిత్ర నిర్మాతలు కూడా తేల్చేశారు. రీసెంట్గా గుంటూరు కారం నిర్మాత నాగ వంశీ కూడా సంక్రాంతికి మాదే అప్పర్ హ్యాండ్ అనేలా గట్టిగా చెప్పారు. ఇక పోటీలో ఉన్న దిల్ రాజు ప్రొడక్షన్ మూవీ ఫ్యామిలీ స్టార్ కూడా అంత ఈజీగా వెనక్కి తగ్గకపోవచ్చు.

వెంకటేష్ సైంధవ సినిమా అయితే ఎప్పుడో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక ఒక నాగార్జున మాత్రం పదేపదే క్లారిటీ ఇవ్వడం లేదు కానీ ఆయన సంక్రాంతి సెంటిమెంట్ ను నమ్ముకుని నా సామి రంగ సినిమాను గట్టిగానే విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక వీటన్నిటిలో కూడా హనుమాన్ సినిమా మాత్రం మినిమం థియేటర్స్ అందుకునే ఛాన్స్ ఉన్నట్లుగా మేకర్స్ అయితే చెబుతున్నారు. ఇప్పటికే ఒక బిగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు చెబుతున్నారు. మరి వీరి ప్రణాళికలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.