Begin typing your search above and press return to search.

హనుమాన్ డొనేషన్.. డౌట్స్ లేకుండా ఓపెన్ గానే..

ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రశాంత్ వర్మ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 9:06 AM GMT
హనుమాన్ డొనేషన్.. డౌట్స్ లేకుండా ఓపెన్ గానే..
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని అద్భుతమైన ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. మొదటి రోజే ఏకంగా 20 కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అన్ని భాషల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో శని, ఆదివారాలు కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రశాంత్ వర్మ టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. సినిమాని ఆధరిస్తోన్న అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ నుంచి అయోధ్య రామమందిరానికి ప్రతి టికెట్ మీద ఐదు రూపాయిలు విరాళం ఇస్తామని చెప్పిన మాటని మరోసారి ప్రస్తావించారు.

ఈ సినిమాకి ప్రతి టికెట్ పై ఐదు రూపాయిలు కచ్చితంగా అయోధ్య రామమందిరానికి విరాళం ఇస్తామనేదానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఒక లెవల్ వచ్చాక కలెక్షన్స్ పై మాట మార్చేస్తారు అనే వారు ఉంటారని, వారందరికీ ట్రాన్స్ పరెంట్ గా ఉండటం కోసం లైవ్ వెబ్ సైట్ ను కూడా స్టార్ట్ చేశామని తెలిపారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ కి ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయనేది డేటా ఉంటుందని అన్నారు.

అలాగే టికెట్ పై ఎంత డొనేషన్ కట్ అవుతుంది కూడా స్పష్టంగా అందులో తెలుస్తుందని, ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చని ప్రేక్షకులకి తెలియజేశారు. ఈ విషయంలో కచ్చితంగా మేము మాట మీద ఉంటామని అన్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ కి పాజిటివ్ టాక్ పెరగడంతో పాటు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ చూడదగ్గ చిత్రం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దీంతో సంక్రాంతి రేసులో ఫెస్టివల్ కలెక్షన్స్ మెజారిటీగా హనుమాన్ దక్కించుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ ఇండియాలో కూడా హనుమాన్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య పెంచుతున్నట్లు సమాచారం.