దేశాలు దాటబోతున్న హనుమాన్.. మరో బిగ్ ప్లాన్
డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేసిన సినిమానే హనుమాన్.
By: Tupaki Desk | 23 Jan 2024 6:24 AM GMTదేశవ్యాప్తంగా ఇప్పుడు సెన్సేషన్ అవుతోన్న పేర్లు రెండే రెండు. అందులో ఒకటి అయోధ్య రామ మందిరం కాగా.. మరొకటి హనుమాన్ మూవీ. అంతలా రియల్ సూపర్ హీరో ఆంజనేయ స్వామి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఇండియా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.
డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేసిన సినిమానే హనుమాన్. సోషియో ఫాంటసీ జోనర్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ దక్కించుకుని ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేసింది. ఎటువంటి స్టార్ నటీనటులు లేకుండా రూ.200 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన తొలి సినిమాగా కూడా నిలిచింది.
అయితే ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పటికే నిర్ణయించింది. ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‍లో విడుదల చేస్తామని ప్రకటించింది. అందుకు తాజాగా సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. అగ్రిెమెంట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ భాషల్లో విడుదల అవ్వనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శీను కీలకపాత్రలు పోషించారు. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొందిన యువకుడి పాత్రను ఈ మూవీలో పోషించారు హీరో తేజ సజ్జా.
అంజనాద్రి అనే ప్రాంతంలో ఈ సినిమా కథ అంతా జరుగుతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి చిత్రంగా హనుమాన్ వచ్చింది. ఆ యూనివర్స్ లో రెండో చిత్రమైన జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రారంభించినట్లు ప్రశాంత్ వర్మ తాజాగా తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.