హనుమాన్ ఫస్ట్ వీక్.. ఇప్పటివరకు ఎంత వచ్చాయంటే..
మైథాలజీ టచ్ చేస్తూ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాతో కథని నడిపించడంతో హనుమాన్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
By: Tupaki Desk | 19 Jan 2024 1:03 PM GMTసంక్రాంతి రేసులో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ సక్సెస్ అందుకుంటూ అద్భుతమైన ఆదరణతో దూసుకుపోతున్న చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న మొట్టమొదటి సూపర్ హీరో మూవీగా హనుమాన్ ఉంది. తేజా సజ్జా ఈ చిత్రంలో హనుమాన్ పవర్స్ వచ్చిన సూపర్ మెన్ గా నటించాడు. మైథాలజీ టచ్ చేస్తూ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాతో కథని నడిపించడంతో హనుమాన్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి ఫెస్టివల్ సందడి ముగిసిన తర్వాత కూడా కలెక్షన్స్ పరంగా జోరు తగ్గలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ లో రికార్డులు సృష్టిస్తోంది. అంచనాల ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 138.7 కోట్లు వసూళ్లు చేసింది. ప్రీమియర్స్ తో కలిపి మొదటిరోజే 23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో 74.3 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
ఇప్పటికే బ్రేక్ ఈవెన్ రీచ్ అయిపోయి లాభాల బాటలో హనుమాన్ నడుస్తోంది. ఇదే స్పీడ్ కొనసాగితే అంచనాల ప్రకారం 150 కోట్ల గ్రాస్ ని ఈ వీకెండ్ ఆఖరుకి హనుమాన్ అందుకునే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం 150 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక హిందీ బెల్ట్ లో కూడా ఏకంగా 41.3 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
ఓవర్సీస్ లో అయితే ఇప్పటి వరకు 3.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని హనుమాన్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు సినిమాలలో టాప్ 6లోకి ఈ మూవీ వచ్చేసింది. త్వరలో టాప్ 5 లోకి చేరిపోతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ ఇండియాలో ఎలాంటి ప్రచారం చేయకుండా కేవలం కంటెంట్ తోనే ఈ మూవీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం విశేషం.
హనుమాన్ సక్సెస్ తో హీరో తేజా సజ్జా ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా నిర్మిస్తోన్న మిరాయ్ మూవీ కోసం ఏకంగా 40 కోట్లకి పైగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నారంట. ఇక హనుమాన్ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.
హనుమాన్ మొదటి వారం షేర్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం - 14.97 కోట్లు
సీడెడ్ - 5.75 కోట్లు
ఉత్తరాంధ్ర - 4.08 కోట్లు
గుంటూరు - 3.16 కోట్లు
తూర్పు గోదావరి - 3.39 కోట్లు
పశ్చిమ గోదావరి - 2.58 కోట్లు
కృష్ణా - 1.86 కోట్లు
నెల్లూరు - 1.03 కోట్లు
మొత్తం తెలుగు రాష్ట్రాలలో - 36.82 కోట్ల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియాలో - 18.55 కోట్ల షేర్
ఓవర్సీస్ లో - 18.95 కోట్ల షేర్
ప్రపంచ వ్యాప్తంగా - 74.32 కోట్ల షేర్ ( గ్రాస్ - 138.7 కోట్లు)