Begin typing your search above and press return to search.

`హ‌నుమ్యాన్` తీసినోడు నా కొడుకు.. ప్ర‌శాంత్ వ‌ర్మ డాడ్!

పెద్ద సినిమాల‌కు చెంప దెబ్బ అంటూ ఆర్జీవీ లాంటి టాప్ డైరెక్ట‌ర్ హనుమ్యాన్ ని ప్ర‌శంసించారు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 7:11 AM GMT
`హ‌నుమ్యాన్` తీసినోడు నా కొడుకు.. ప్ర‌శాంత్ వ‌ర్మ డాడ్!
X

సంక్రాంతి బ‌రిలో మూడు పెద్ద సినిమాల‌తో పోటీప‌డుతూ విడుద‌లైంది ప్ర‌శాంత్ వ‌ర్మ -హ‌నుమ్యాన్. తేజ స‌జ్జా న‌టించిన ఈ చిత్రానికి యునానిమ‌స్‌గా అద్భుత స‌మీక్ష‌లు వ‌చ్చాయి. పెద్ద సినిమాల‌కు చెంప దెబ్బ అంటూ ఆర్జీవీ లాంటి టాప్ డైరెక్ట‌ర్ హనుమ్యాన్ ని ప్ర‌శంసించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన గుంటూరు కారం.. సైంధవ్ ల‌తో పోలిస్తే హ‌నుమ్యాన్ సంక్రాంతి హిట్ గా ధృవీక‌రించ‌బ‌డింది. ఈరోజు నాగార్జున న‌టించిన `నా సామి రంగ` సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైంది. దీనికి సంబంధించిన స‌మీక్ష‌లు కాసేప‌ట్లో రానున్నాయి.

ఇకపోతే ప్ర‌శాంత్ వ‌ర్మ హ‌నుమ్యాన్ చూసిన వారంతా ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా త‌మ స‌మీక్ష‌ల‌ను పంచుకుంటున్నారు. సెల‌బ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా అంద‌రూ ముక్త కంఠంతో ఈ సినిమాని ప్ర‌శంసిస్తున్నారు. ఈసారి సంక్రాంతి బ‌రిలో ప్ర‌శాంత్ వ‌ర్మ గేమ్ ఛేంజ‌ర్ గా మారాడు.

ఇలాంటి త‌రుణంలో అత‌డి కుటుంబం ఎలా ఎగ్జ‌యిట్ అవుతోందో అత‌డి తండ్రి వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం హ‌నుమ్యాన్ సినిమా ఆడుతున్న థియేట‌ర్ల‌లో మొత్తం హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరోవైపు ప్రశాంత్ వర్మ తండ్రి స్థానిక మీడియాతో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి ఎవరో తెలియక సినిమా ఎలా ఉందని రిపోర్టర్ అడగ్గా...సూప‌ర్.. తీసినోడు నా కొడుకు! అంటూ గ‌ర్వంగా చెప్పారు. మీ అబ్బాయి సినిమా ఎలా ఉంది? అని అడ‌గ్గా.. లైఫ్ లో మొద‌టి ఎక్స్ పీరియ‌న్స్.. సినిమాలో ప్ర‌తి పాత్రా సూప‌ర్భ్ అని అన్నారు. హ‌ను మ్యాన్ త‌ర్వాత పార్ట్ 2 తీస్తాడా? అని ప్ర‌శ్నించ‌గా, హ‌నుమాన్ మీద‌నే డైరెక్టుగా సినిమా వ‌స్తుంది అని కూడా ఆయ‌న అన్నారు. త‌న కొడుకు విజ‌యానికి వంద‌శాతం గ‌ర్వంగా ఉంద‌ని అన్నారు.

ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పుత్రోత్సాహ‌మ్ము ఆ పుత్రుడు జ‌నించ‌గా.. ప‌ద్యం ఇప్పుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తండ్రిని చూశాక మ‌రోసారి గుర్తు చేసుకోవాల్సి వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌లు అండ‌దండ‌ల‌తో హ‌నుమ్యాన్ రూపంలో ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న కెరీర్ లో తొలి పాన్ ఇండియా హిట్ ని అందుకున్నాడు.