'హనుమాన్' అఖండ భారతం.. ఊహించని యూనివర్స్!
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు
By: Tupaki Desk | 19 Dec 2023 3:06 PM GMTటాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హనుమాన్' వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయింది తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముందుగా తేజ సజ్జా మాట్లాడుతూ..సినిమా ప్రమోషన్ మెటీరియల్ కి వచ్చిన భారీ రెస్పాన్స్ కి థాంక్స్ చెప్పాడు." మనం మన ధర్మాన్ని అనుసరిస్తే, ధర్మం కోసం నిలబడితే ఏదైనా నిజాయితీగా చేస్తే, అది ప్రతిదీ విజయానికి దారి తీస్తుంది. అలాగే నేను కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. మేము సినిమా స్టార్ట్ చేసిన టైంలో ప్రేక్షకుల నుంచి ఇలాంటి ప్రేమ లభిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు" అని అన్నాడు.
అంతేకాకుండా హనుమంతుడి దయతో ఓ సాధారణ యువకుడు సూపర్ హీరోగా మారడమే హనుమాన్ మూవీ కథ అని తేజ సజ్జ వెళ్లడించాడు." మాకు సినిమా స్టార్టింగ్ టైం లో చాలా భయాలు ఉన్నాయి. అలాగే మేకింగ్ లో కూడా ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సీతను చేరుకోవడానికి శ్రీరాముడు ఎలా సముద్రాన్ని దాటాడో. అలాగే హనుమాన్ కోసం మేము కష్టపడి నిజాయితీగా పని చేశాం. ప్రెజెంట్ దేశవ్యాప్తంగా ప్రశాంత్ పేరు వినిపిస్తోంది. సలార్ కోసం ప్రశాంత నీల్ అలాగే హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మ. హనుమాన్ ఫుల్ పైసా వసూల్ మూవీ" అని సినిమా గురించి చెప్పుకొచ్చాడు తేజ సజ్జ.
అనంతరం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.." హనుమాన్ పెద్ద సినిమా కాదు. ఇది ఒక చిన్న సినిమా. దీన్ని చిన్న సినిమా గానే మొదలుపెట్టాం. ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మేకింగ్ పై మరింత దృష్టి పెట్టాం. అలా అని బడ్జెట్ పెంచలేదు. మాకు ఉన్న దాంట్లోనే ఎంత చక్కగా క్వాలిటీ గా చేయొచ్చో ప్రయత్నించాం. స్టార్స్, బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా ఏమో. కానీ కంటెంట్ పరంగా చాలా పెద్ద సినిమా. హనుమాన్ పెద్ద సినిమా కాకపోవచ్చు. కానీ మేము పెట్టిన ఎఫర్ట్స్ చాలా పెద్దవి. లిమిటెడ్ బడ్జెట్లో ఓ గ్రేట్ మూవీ తీశాము.
మాకు స్టార్ అట్రాక్షన్ లేదు మాకు ఉన్న స్టార్ హనుమాన్ మాత్రమే. ఆయనే మా పాన్ వరల్డ్ స్టార్. ఆయనకున్న లార్జెర్ ఆడియన్స్ ఎవరికీ లేరు. ఆయనే మా బలం. సినిమాలో హనుమాన్ ఉన్నారా లేదా అనేది సస్పెన్స్. హనుమాన్ పాత్రను ఎవరు పోషించారనేది కూడా సస్పెన్స్. హనుమాన్ కోసం అంజనాద్రి అఖండ భారత్ అనే కల్పిత ప్రపంచాన్ని రూపొందించాం. ఇందులో ఉన్న నెక్స్ట్ పార్ట్స్ ని రాబోయే సినిమాటిక్ యూనివర్స్ లో చూస్తారు" అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.
సంక్రాంతి రిలీజ్ గురించి మాట్లాడుతూ.." ఎవరు అనౌన్స్ చేయకముందే మా సినిమాని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించాం. కాబట్టి రిలీజ్ డేట్ మార్చలేం. మొదటి వారంలో భారీ ఓపెనింగ్స్ వచ్చే సినిమా కాదు. ఇది చాలా కాలం పాటు థియేటర్స్ లో రన్ అయ్యే సినిమా" అని అన్నారు.