Begin typing your search above and press return to search.

హనుమాన్ కథ.. ఎలా ఉంటుందంటే..

ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   2 Jan 2024 4:01 AM GMT
హనుమాన్ కథ.. ఎలా ఉంటుందంటే..
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా హనుమాన్ సినిమా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా బ్రాండ్ తో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడు. సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతోన్న సినిమాలలో గుంటూరు కారం తర్వాత ఎక్కువ మంది హనుమాన్ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. హనుమంతుడు క్యారెక్టర్ లో తేజా సజ్జా కనిపించబోతున్నాడు అంటూ ఒక టాక్ వినిపిస్తోంది. మైథాలజీ టచ్ తో ఈ మూవీ కథని ప్రశాంత్ వర్మ చెబుతున్నారు అంటూ కథనాలు ప్రసారం అవుతున్నాయి. అంజనాద్రి అనే ఒక ఫిక్షనల్ విలేజ్ పెట్టడంతో హనుమంతుడిగా జన్మస్థలంలో జరిగే కథ అయ్యి ఉంటుందని కూడా చెబుతున్నారు.

ఇలా భిన్నమైన ప్రచారాలు నడుస్తూ ఉండటంతో తాజాగా ప్రశాంత్ వర్మ ఈ మూవీ స్టొరీ అవుట్ లైన్ ఏంటనేది క్లారిటీ ఇచ్చేశాడు. హనుమంతుడి శక్తి వచ్చిన ఒక సామాన్యుడు తన గ్రామాన్ని ఆపద నుంచి ఎలా కాపాడాడు. అలాగే ప్రపంచాన్ని ఎలా కాపాడాడు. విలన్స్ ని ఎలా నాశనం చేసాడు అనే పాయింట్ తోనే మూవీ ఉండబోతోందని చెప్పేశాడు.

స్టొరీ ఏంటనేది ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేయడంతో ఇప్పుడు హనుమాన్ పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని డిజైన్ చేసి ఏకంగా 12 సూపర్ హీరో కథలని చెప్పాలని అనుకుంటున్నాడు. దీని తర్వాత డివివి దానయ్య తనయుడుతో అధీరా అనే మూవీ చేయబోతున్నాడు. దీని తర్వాత విమెన్ సూపర్ హీరో పాత్రతో మూవీ ఉంటుందంట.

ఇవన్ని సిల్వర్ స్క్రీన్ పైకి ఎక్కాలంటే ప్రస్తుతం రాబోతున్న హనుమాన్ మూవీ కచ్చితంగా సక్సెస్ కావాలి. అప్పుడే ఈ వెంచర్ లోకి పెద్ద నిర్మాతలు వచ్చి భారీ బడ్జెట్ లు పెట్టడానికి రెడీ అవుతారు. ప్రశాంత్ వర్మ కూడా అదే అజెండాతో హనుమాన్ సినిమాని పెర్ఫెక్ట్ గా మార్కెట్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు.