హడావుడి అంతా మొదటి షో వరకే!
యువ హీరో తేజ సజ్జా నంటించిన 'హనుమాన్' సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హిట్ టాక్ తో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 14 Jan 2024 10:19 AM GMTయువ హీరో తేజ సజ్జా నంటించిన 'హనుమాన్' సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హిట్ టాక్ తో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కి ముందు థియేటర్ల విషయంలో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. తమ సినిమాకి తక్కువ థియేటర్లు కేటాయించార ని చిత్ర నిర్మాత ఆవేదన వ్యక్తం చేయడం..రిలీజ్ అనంతరం పాజిటివ్ టాక్ రావడం అన్ని సంచలనం గానే మారాయి.
మొత్తంగా 'హనుమాన్' టీమ్ పెట్టుకున్న నమ్మకాన్ని సినిమా విజయంతో నిలబెట్టింది. అయితే ఈసినిమా రిలీజ్ కి ముందు బాగానే హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ హైప్ కి చిన్న సినిమా అనే సింపతీ కారణమా? అనే ప్రశ్న యువ హీరో తేజ ముందుకు వెళ్తే ఆయన ఆసక్తికరంగా స్పందించాడు. దాన్ని ఆయన ఖండించాడు. ఇప్పటివరకూ ఆ కోణంలో ఎక్కడా మాట్లాడలేదన్నాడు. ఒకవేళ సింపతీ కారణమైతే హిందీ..కన్నడతో పాటు మిగతా భాషల్లో మంచి ఓజెనింగ్స్ రావడానికి కారణమేంటి? అని తిరిగి ప్రశ్నించాడు.
తాము ముందు నుంచి నమ్మింది..చెప్పింది ఒక్కటే సినిమా మాత్రమే మాట్లాడుతుందని. మిగతా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఫస్ట్ షో వరకే పరిమితమవుతాయని.. ఆ తర్వాత సినిమా మాత్రమే మాట్లాడుతుందని అన్నాడు. కంటెంట్ ఉన్న సినిమాకి కటౌట్ తో పనిలేదని ఇప్పటికే చాలా చిన్న సినిమా లు రుజవు చేసాయి. పర భాష సినిమాలు సైతం తెలుగులో సత్తా చాటాయి? అంటే దానికి కారణం కంటెంట్.
అటుపై ఆ సినిమాని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అదే సినిమాకి సక్సెస్ కి బాట వేస్తున్నాయి. ఆర్బాటం అనేది కొంతవరకే పరిమితం. అతి ఎక్కువై తేడా కొడితే సన్నివేశం ఎలా ఉంటుందో కూడా గెస్ చేయో చ్చు. జనవరి 12న మహేష్ నటించిన 'గుంటూరు కారం'.. ఆ మరుసటి రోజున వెంకటేష్ నటించిన 'సైంధవ్' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వాటికొచ్చిన రివ్యూలు..టాక్ సంగతి విధితమే.