Begin typing your search above and press return to search.

హనుమాన్.. రంగంలోకి బడా స్టార్స్

ముఖ్యంగా సంక్రాంతికి స్టార్ హీరోలు అంతా ఒకేసారి వస్తున్నా కూడా రిలీజ్ విషయంలో ప్రశాంత్ వర్మ తగ్గలేదు.

By:  Tupaki Desk   |   1 Jan 2024 8:01 AM GMT
హనుమాన్.. రంగంలోకి బడా స్టార్స్
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ముఖ్యంగా సంక్రాంతికి స్టార్ హీరోలు అంతా ఒకేసారి వస్తున్నా కూడా రిలీజ్ విషయంలో ప్రశాంత్ వర్మ తగ్గలేదు. అనుకున్న తేదీ జనవరి12నే రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనేక సార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి.

నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఏకంగా రూ.7.5కోట్లు ఇచ్చిందంటే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధమవుతోంది. ఆంధ్ర, సీడెడ్ లో కూడా ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. మొత్తం కలిపి రూ.20 కోట్లకుపైగా బిజినెస్ జరగనున్నట్లు తెలుస్తోంది. పెద్ద పండుగకు గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, నా సామిరంగా లాంటి సినిమాలు పోటీలో ఉన్నా కూడా హనుమాన్‌కు ఈ రేంజ్ బిజినెస్ జరగడం గ్రేటే అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా స్టార్ హీరోలను రంగంలోకి దించుతున్నారు ప్రశాంత్‌ వర్మ . టాలీవుడ్‌లో తనకు ఉన్న పరిచయాలు హనుమాన్ కోసం వాడుకుంటున్నారు. ఆరు నెలల కిందట ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ కోసం ప్రశాంత్ వర్మ పని చేశారు. తిరుపతిలో జరిగిన ఆ ఈవెంట్ మొత్తాన్ని డైరెక్ట్ చేసిందే ఆయనే. ప్రభాస్‌తో అప్పుడు ప్రశాంత్‌కు బాగానే పరిచయం ఏర్పడింది. దాన్నిప్పుడు తన సినిమా కోసం వాడుకుంటున్నారు.

మరోవైపు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 ప్రోమోను కూడా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. అలా బాలయ్యతోనూ ఈయనకు మంచి పరిచయమే ఉంది. ఇప్పుడు దాన్ని కూడా తన సినిమా కోసం వాడేస్తున్నారు. వీరిద్దరే కాకుండా చిరంజీవి దగ్గరకు కూడా వెళ్లారట ప్రశాంత్ వర్మ. ఈ లెక్కన టాలీవుడ్ టాప్ హీరోల్లో చాలా మందిని కదిలిస్తున్నారు. అందరినీ రంగంలోకి దించుతున్నారు.

అయితే విజయవాడ లేదా తిరుపతిలో జనవరి 3 లేదా 7వ తేదీన ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ప్రభాస్, బాలయ్య, చిరంజీవిని సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం వీరు ముగ్గురు వారివారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ వారిని తీసుకొచ్చేందుకు ప్రశాంత్ వర్మ శాయశక్తులా పరిచయం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.