హను-మాన్ బ్యాచ్ క్రియేటివిటీతో కొడతారు
సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో పోటీపడుతూ విడుదలవుతోంది హను-మాన్. ఈ చిత్రం టాలీవుడ్‌లో మొదటి సూపర్ హీరో చిత్రం.
By: Tupaki Desk | 7 Jan 2024 11:45 AM GMTసంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలతో పోటీపడుతూ విడుదలవుతోంది హను-మాన్. ఈ చిత్రం టాలీవుడ్‌లో మొదటి సూపర్ హీరో చిత్రం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటిది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ దశ నుంచే భారీ హైప్ ని అందుకోవడంలో సఫలమైంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రచార వ్యూహం ఫలించి వీక్షకులలో గణనీయమైన అంచనాలను పెంచింది. 12 జనవరి 2024న గ్రాండ్‌గా విడుదల కానుంది.
యువహీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. ఇటీవల చిత్రబృందం సృజనాత్మక కౌంట్‌డౌన్ పోస్టర్‌లతో సినీ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షించింది. సినిమా ప్రేమికులుఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటారు. హను-మాన్‌ని అత్యంత ఆకర్షణీయమైన మార్గాల్లో ట్రెండింగ్ టాపిక్‌గా మార్చడంలో టీమ్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. హను-మాన్ చిత్రంలో కీలక పాత్రల్లో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, గెటప్ శ్రీను తదితరులు నటించారు.
శ్రీమతి సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. చైతన్య, గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ స్వరపరిచిన సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది.
హను మాన్ టైటిల్ వినగానే, ఆధునిక యువకుడికి హనుమంతుడి కనెక్షన్ ఏమిటన్నది తెలుసుకోవాలనే కుతూహాలం ప్రజల్లో నెలకొంది. ఇటీవలి కాలంలో రకరకాల వైవిధ్యం ఉన్న జానర్లలో సినిమాలు వచ్చాయి కానీ హనుమంతుడి కథతో లేదా హనుమంతుడి స్ఫూర్తితో ఎవరూ సినిమా తీయలేదు. ఇది ప్రశాంత్ వర్మ టీమ్ కి ప్రధాన అసెట్ కానుంది. హను-మాన్ క్రియేటివిటీ నచ్చితే సంక్రాంతి బరిలో ఎంత పోటీ ఉన్నా.. విజయం దక్కించుకునేందుకు ఆస్కారం ఉంది.