Begin typing your search above and press return to search.

హనుమాన్.. అలా జరిగి ఉంటే మరో రూ.200 కోట్లు పక్కా!

కానీ ఈ సినిమా జనవరిలోని సంక్రాంతి టైమ్లో కాకుండా ఇప్పుడు రిలీజ్ అయ్యింటే ఇంకో రూ.200 కోట్ల లాభం అధికంగా వచ్చేదేని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 8:30 AM GMT
హనుమాన్.. అలా జరిగి ఉంటే మరో రూ.200 కోట్లు పక్కా!
X

హనుమాన్ సినిమా సెన్సేషన్‍ ను కొనసాగిస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న చిత్రంగా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ హీరో మూవీకి సినీ ప్రియుల ఆదరణ కొనసాగుతూనే ఉంది. జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాగా.. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్‍ తోనే దూసుకెళుతోంది. ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది.

తెలుగు చిత్రసీమలో కొన్నేళ్లపాటు చెప్పుకునే సక్సెస్ అంటే హనుమాన్ చిత్రానిదే. తక్కువ బడ్జెట్ సినిమాగా సంక్రాంతి సందర్భంగా రిలీజై ఎవరూ ఊహించని పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. పోటీలో బడా హీరోలు చిత్రాలు ఉన్నా బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డులు సృష్టించింది. విడుదలై రెండు వారాలు దాటినా ఈ మూవీ జోరు ఇంకా తగ్గలేదు. మూడో వీకెండ్ లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

హనుమాన్ సినిమా వసూళ్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.265 కోట్లకుపైగా దాటేశాయి. ఇప్పటికే ఈ సినిమా బయ్యర్లకు ఐదు రెట్ల కంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీకి రూ.120కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలో రూ.50కోట్లకు పైగా వసూళ్లను కలెక్ట్ చేసిందట. విదేశాల్లోనూ రూ.53 కోట్లకు పైగా కలెక్షన్లను ఈ సూపర్ హీరో మూవీ రాబట్టిందట

కానీ ఈ సినిమా జనవరిలోని సంక్రాంతి టైమ్లో కాకుండా ఇప్పుడు రిలీజ్ అయ్యింటే ఇంకో రూ.200 కోట్ల లాభం అధికంగా వచ్చేదేని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు కారణాలను కూడా వెల్లడిస్తున్నారు. ఇప్పటికే భారీగా ప్రాఫిట్లు వచ్చిన విషయం నిజమే అయినా.. రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఒక్కసారిగా ఆలోచించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సంక్రాంతికి రిలీజైనా.. మొదటి మూడు రోజులు థియేటర్లు దక్కకపోవడం వల్ల కాస్త నష్టం వచ్చిందని అంటున్నారు.

అయితే అయోధ్యలోని బాల రాముడి ప్రాణప్రతిష్ఠ.. హనుమాన్ మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజులకే జరిగింది. దీంతో అయోధ్య మహోత్సవాల్లో బీజేపీ కార్యకర్తలతోపాటు ఆర్ఎస్ఎస్ సభ్యులు ఫుల్ బిజీ అయిపోయారు. నిఖిల్ కార్తికేయ మూవీకి వాళ్లు పరోక్షంగా ప్రమోట్ చేసినట్లుగా హనుమాన్ సినిమాకు చేయలేదని చొప్పొచ్చు. ఎందుకంటే 500 ఏళ్ల తర్వాత రాముడి ఆగమనంతో వారు అక్కడే దృష్టి పెట్టారు. వారు కానీ ఈ మూవీపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి ఉంటే మరో రూ.200-300 కోట్ల లాభం వచ్చేదని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత హనుమాన్ సినిమా థియేటర్లకి వస్తుందని అంతా భావించామని, మేకర్స్ పండక్కే రిలీజ్ చేశారని అంటున్నారు.