Begin typing your search above and press return to search.

సలార్ కన్నా హనుమాన్ కు చాలా ఎక్కువ!

ఏకంగా 10.26 టీఆర్పీ రేటింగ్‌ ను సొంతం చేసుకుంది. ఓటీటీ, ఐపీఎల్ పోటీ తట్టుకొని బుల్లితెరపై హనుమాన్ దూసుకెళ్లడం మామూలు విషయం కాదని చెప్పాలి.

By:  Tupaki Desk   |   9 May 2024 7:07 PM GMT
సలార్ కన్నా హనుమాన్ కు చాలా ఎక్కువ!
X

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. మరెన్నో రికార్డులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి మేకర్స్ కు లాభాల పంట పండించింది. 2024 సంక్రాంతి విన్నర్ గా నిలిచిందీ చిత్రం.

విజువల్ వండర్ గా రూపొందిన హనుమాన్ మూవీ.. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత జీ5 ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా పలు రికార్డులను క్రియేట్ చేసింది. థియేటర్లలో లాగే భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అలా చాలా వారాల పాటు హనుమాన్ సినిమా టాప్‌ ట్రెండింగ్ లో నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీతో పాటు శాటిలైట్ హక్కులను కూడా జీ నెట్‌వర్క్ దక్కించుకుంది. కొద్ది రోజుల క్రితమే జీ తెలుగు ఛానెల్‌ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ గా ప్రసారమైంది.

ఏప్రిల్ 28న హనుమాన్ మూవీ టెలికాస్ట్ అయింది. టీవీల్లో కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఏకంగా 10.26 టీఆర్పీ రేటింగ్‌ ను సొంతం చేసుకుంది. ఓటీటీ, ఐపీఎల్ పోటీ తట్టుకొని బుల్లితెరపై హనుమాన్ దూసుకెళ్లడం మామూలు విషయం కాదని చెప్పాలి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి తొలి సినిమాగా వచ్చిన హనుమాన్.. హవా ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట.

అయితే ఈ మధ్య కాలంలో టీవీల్లోకి వచ్చిన సినిమాల్లో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం 9.86 టీఆర్పీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత 9.23 టీఆర్పీతో గుంటూరు కారం మూవీ ఉంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డును హనుమాన్ చిత్రం బద్దలు కొట్టింది. ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో స్కంద(8.5), ఆ తర్వాత నా సామిరంగా(8.15), మంగళవారం(8.3), పాన్ ఇండియా స్టార్ సలార్ చిత్రాలు ఉన్నాయి.

సలార్ మూవీ 'స్టార్ మా'లో టెలికాస్ట్ కాగా 6.5 టీఆర్పీ మాత్రమే నమోదు చేసింది. సలార్ తో పోలిస్తే హనుమాన్ మూవీకి వచ్చిన టీఆర్పీ చాలా ఎక్కువ అని చెప్పాలి. అయితే హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ చిత్రం రానుంది. హనుమాన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌ గా నటించగా.. వరలక్ష్మి శరత్‌ కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు.