హనుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ ఎంత?
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.
By: Tupaki Desk | 31 Dec 2023 10:20 AM GMTప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ సూపర్ హీరో మూవీగా హనుమాన్ సినిమా రాబోతోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. మైథలాజికల్ టచ్ తో కంప్లీట్ ఫిక్షనల్ కాన్సెప్ట్ ని హనుమాన్ సినిమాలో చూపించబోతున్నారు. తేజా సజ్జా ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. వినయ్ ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా అన్ని భాషలలో బిజినెస్ ఇప్పటికే జరిగిపోయింది. నాన్ థీయాట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకి అమ్ముడయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు.
గుంటూరు కారం సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ బిజినెస్ హనుమాన్ చిత్రానికి జరగడం విశేషం. ఈ సినిమా నైజాం 7.2 కోట్ల బిజినెస్ చేసింది. ఆంధ్రా మొత్తం 10 కోట్ల వరకు వ్యాపారం జరిగింది. సీడెడ్ లో 4 కోట్ల బిజినెస్ అయ్యింది. ఓవరాల్ గా 21 కోట్ల మేరకు మూవీపై బిజినెస్ జరగడం విశేషం. అంటే 21.50 కోట్ల షేర్ ను అందుకుంటేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క. సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతోన్న సినిమాలలో గుంటూరు కారం హైయెస్ట్ బిజినెస్ అయిన చిత్రంగా ఉంది.
దాని తరువాత హనుమాన్ నిలవడం విశేషం. అలాగే ఎక్కువ మంది చూడటానికి ఆసక్తి చూపిస్తున్న సినిమాల జాబితాలో కూడా హనుమాన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. జనవరి 12న గుంటూరు కారం సినిమాతోనే పాటే హనుమాన్ కూడా రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ మూవీ హిట్ అయితే ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తోన్న సూపర్ హీరోల పరంపర మంచి ఆరంభం దొరికినట్లు అవుతుంది.
అలాగే బడ్జెట్ ఎంతైనా నిర్మాతలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. మరి హనుమాన్ సినిమా ప్రశాంత్ టీంకి ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.