Begin typing your search above and press return to search.

హనుమాన్.. ఇప్పటివరకు వచ్చిన లాభాలు ఎంతంటే?

ముఖ్యంగా పండగ టైమ్ లో అయితే అంచనాల ప్రకారం 6 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇ

By:  Tupaki Desk   |   18 Jan 2024 11:35 AM GMT
హనుమాన్.. ఇప్పటివరకు వచ్చిన లాభాలు ఎంతంటే?
X

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరపైకి తీసుకువచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అసలు ఈ రేంజ్ లో హనుమాన్ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అని ఎవరు ఊహించలేదు. చిత్ర యూనిట్ కి రిలీజ్ విషయంలో కొంతవరకు చేదు అనునవాలు ఎదురయినప్పటికీ కూడా పాజిటివ్ టాక్ తో మాత్రం ఆ తర్వాత కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది.

ఇక ఈ సినిమాపై రిస్క్ చేసి పెట్టుబడులు పెట్టిన వారికి మాత్రం మంచి లాభాలను అందిస్తుంది. ముఖ్యంగా హనుమాన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నైజంలో మొదట కొన్ని లిమిటెడ్ థియేటర్లలోనే విడుదల చేయాల్సి వచ్చింది. ఇక తర్వాత రెస్పాన్స్ బట్టి సినిమాకు షోలు పెరిగాయి. దీంతో పెట్టిన పెట్టుబడి ఇప్పటికే వెనక్కి రాగా ఇప్పుడు ప్రస్తుతం మంచి లాభాలను అందుకుంటున్నారు.

మొదట హనుమాన్ ప్రీమియర్స్ లను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అప్పుడే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంచనాల ప్రకారం రెండున్నర కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఇక తర్వాత మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మినిమం 5 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ అందుకుంటూ వెళుతుంది. ముఖ్యంగా పండగ టైమ్ లో అయితే అంచనాల ప్రకారం 6 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక 6వ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమాకు ఐదు కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రావడం విశేషం.

అంచనాల ప్రకారం 6 రోజుల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి

నైజాం: 15.75 కోట్లు

సీడెడ్: 4.67 కోట్లు

ఉత్తరాంధ్ర: 4.53 కోట్లు

ఈస్ట్: 3.35 కోట్లు

వెస్ట్: 2.02 కోట్లు

గుంటూరు: 2.27 కోట్లు

కృష్ణ: 1.90 కోట్లు

నెల్లూరు: 1.11 కోట్లు

AP-TG మొత్తం:- 35.60 కోట్లు

ఇక ఈ సినిమాకు కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అటువైపు నుంచి అంచనాల ప్రకారం 6 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా హిందీ అలాగే మిగతా రాష్ట్రాల్లో అంచనాల ప్రకారం మొత్తంగా కలిపి 10 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో కూడా దాదాపు 16 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అయితే వచ్చాయని తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమా అంచనాల ప్రకారం 68.50 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే గాస్ కలెక్షన్స్ 130 కోట్లకు చేరువయ్యింది. ఇక ట్రేడ్ వర్గాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ 29 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లకు ఫిక్స్ అయింది. ఇక అంచనాల ప్రకారం లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సినిమా 38 కోట్లకు పైగా ప్రాఫిట్స్ లో వెళుతోంది. చూస్తూ ఉంటే ప్రాఫిట్స్ లెక్క 70 కోట్ల రేంజ్ లో ఉండబోతున్నట్లు అంచనా.