హనుమాన్ టీం.. బాక్సాఫీస్ మాస్టర్ ప్లాన్..!
అయినా సరే హనుమాన్ ఇంకా థియేట్రికల్ రన్ పూర్తి కాలేదు సరికదా అక్కడక్కడ సినిమా ఆడుతూనే ఉంది.
By: Tupaki Desk | 16 Feb 2024 3:23 PM GMTఆల్రెడీ ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుని 300 కోట్ల దాకా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న హనుమాన్ మూవీ ఐదవ వారం పూర్తి చేసుకుని ఆరో వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే ఆ సినిమాతో థియేట్రికల్ రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కూడా అయ్యాయి. అయినా సరే హనుమాన్ ఇంకా థియేట్రికల్ రన్ పూర్తి కాలేదు సరికదా అక్కడక్కడ సినిమా ఆడుతూనే ఉంది. అయితే ఈ టైం లో హనుమాన్ టీం మరో మాస్టర్ ప్లాన్ తో వేశారు.
హనుమాన్ సినిమా ఇప్పటివరకు చూడని వారు.. ఇప్పటికే చూసిన వారు ఈ ఇద్దరికి సినిమా టికెట్ రేట్లని తగ్గిస్తూ సర్ ప్రైజ్ చేశారు. హనుమాన్ సినిమాను నైజాం లో ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు కేవలం 100 రూపాయలకే చూపించాలని ఫిక్స్ అయ్యారు. సింగిల్ స్క్రీన్ లో 100, మల్టీప్లెక్స్ లో 150 గా హనుమాన్ టికెట్స్ రేట్లు కుదించారు. ఆరో వారం లో ఈ టికెట్ రేట్ల తగ్గింపు హనుమాన్ బాక్సాఫీస్ మాస్టర్ ప్లాన్ అని చెప్పొచ్చు.
ఎలాగు సినిమా ఈ రేంజ్ హిట్ అయ్యింది కాబట్టి డిజిటల్ రిలీజ్ కు కొద్దిగా టైం తీసుకుంటారు. ఈలోగా సినిమా చూడాలంటే థియేటర్ లోనే చూసేయాలి. అయితే టికెట్ రేటు ఎక్కువ అయితే అది కుదరదు కాబట్టి ఇలా రేటు తగ్గించి అందుబాటులో ఉండేలా చేశారు చిత్ర యూనిట్. కచ్చితంగా ఈ తగ్గించిన టికెట్ రేట్లతో హనుమాన్ కలెక్షన్స్ లో కొంత జోరు కనిపించే అవకాశం ఉంటుంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు. తేజా సజ్జ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి రిలీజైన ఏ సినిమా కూడా అందుకోని సక్సెస్ తో హనుమాన్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. హనుమాన్ సూపర్ హిట్ క్రేజ్ తో ఆడియన్స్ అంతా కూడా జై హనుమాన్ కోసం ఎదురుచూస్తున్నారు. 2025 లోనే జై హనుమాన్ ని రిలీజ్ చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పినా సినిమాపై పెరిగిన ఈ అంచనాలకు తగినట్టుగా సినిమా తీసేందుకు కొంత టైం తీసుకునేలా ఉన్నారని చెప్పొచ్చు. హనుమాన్ సూపర్ హిట్ వైబ్ ని జై హనుమాన్ తో కూడా కొనసాగించాలని ఆ సినిమా లవర్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.