Begin typing your search above and press return to search.

ఆ సినిమాకి ప్ర‌భాస్ ముహూర్తం పెట్టేసాడా?

`క‌ల్కి 2898` భారీ విజ‌యం సాధించ‌డంతో ప్ర‌భాస్ విదేశాల‌కు చెక్కేసిన సంగతి తెలిసిందే. క‌ల్కి స‌క్సెస్ ని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   1 July 2024 7:22 AM GMT
ఆ సినిమాకి ప్ర‌భాస్ ముహూర్తం పెట్టేసాడా?
X

`క‌ల్కి 2898` భారీ విజ‌యం సాధించ‌డంతో ప్ర‌భాస్ విదేశాల‌కు చెక్కేసిన సంగతి తెలిసిందే. క‌ల్కి స‌క్సెస్ ని విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమా 500 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. అన్ని ర‌కాల రికార్డుల‌ను చెరిపేస్తూ ముందుకెళ్తుంది. సినిమా 1500 కోట్ల వ‌సూళ్లు సాధిస్తుంద‌ని చిత్ర నిర్మాత అశ్వీనిద‌త్ ధీమా వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ న‌మ్మ‌కం త‌మకుంద‌ని గంటా ప‌థంగా చెప్పారు. మ‌రి సినిమా `ఆర్ ఆర్ ఆర్` రికార్డుల‌ను చెరిపేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

ఇక్క‌డ నుంచి స్థిర‌మైన వసూళ్లు రాబ‌డితేనే అది సాధ్య‌మ‌వుతుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే మ‌రి విదేశాల నుంచి వ‌చ్చిన త‌ర్వాత డార్లింగ్ చేయ‌బొయే పనేంటి? అంటే పెండింగ్ రాజాసాబ్ షూటింగ్ పూర్తి చేస్తారు. ఇప్ప‌టికే నెమ్మ‌దిగా సాగుతోన్న ఆ సినిమా షూట్ ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే హ‌నురాఘ‌వ‌పూడి ప్రాజెక్ట్ ని కూడా ప‌ట్టాలెక్కించ‌డానికి డార్లింగ్ రెడీ అవుతున్నాడు.

అక్టోబ‌ర్ లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నాడుట‌. ఆసినిమాకి కాల్షీట్లు కూడా కేటాయించేసాడ‌ని స‌మాచారం. వ‌ర‌ల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ల‌వ్ స్టోరీ ఇది. `సీతారామం` త‌ర్వాత హ‌నురాఘ‌వ‌పూడి ఈ సినిమాపైనే ప‌నిచేసాడు. ల‌వ్ స్టోరీలు ఎగ్జిక్యూట్ చేయ‌డంలో హను ఓ బ్రాండ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ స్టోరీని వార్ నేప‌థ్యంలో ఏ రేంజ్ కి తీసుకెళ్తాడు? అన్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం హ‌నురాఘ‌వ‌పూడి ఈ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్నారుట‌. హీరోయిన్ గా ఎవ‌ర్ని తీసుకోవాలి? కీల‌క న‌టులు ఎవరు? వంటి ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నారుట‌. ర‌ష్మికా మంద‌న్నా, మృణాల్ ఠాకూర్ పేర్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలోకి వచ్చాయి? అయితే వాళ్ల‌క‌న్నా ఫేం ఉన్న భామ‌ల్ని దించాల‌న్న‌ది మరో ప్లాన్ గా తెర‌పైకి వ‌స్తోంది. అలాగే సంగీత ద‌ర్శ‌కుడిగా వివేక్ సాగ‌ర్ ని తీసుకున్న‌ట్లు వినిపిస్తుంది. మ‌రి అతడితో హ‌ను మ్యూజిక‌ల్ గా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.